అంతర్జాతీయం
క్రైస్తవులు గేలకు క్షమాపణ చెప్పాలి
  • క్రైస్తవులు గేలకు క్షమాపణ చెప్పాలి
  • News Postdate
  • News id435
Feature image

రోమ్: క్రైస్తవులు, రోమన్ కేథలిక్ చర్చిలు గేలకు క్షమాపణ చెప్పాలని పోప్ ఫ్రానిన్స్ ఆదివారం పేర్కొన్నారు. గేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జర్మన్ కార్డినల్ రీన్హార్డ్ మార్క్ వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. జర్మనీ చర్చి గే లతో పాటు పేదలకు స్త్రీలకు, పిల్లలకు క్షమాపణ చెప్పాలన్నారారు. అమెరికాలో నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయన నేపథ్యంలో రిన్హార్డ్ మార్క్ గేల పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

పూర్తి వార్తలు వీక్షించండి
యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు!
  • యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు!
  • News Postdate
  • News id434
Feature image

సనా: యెమెన్‌లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్‌లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం ‘గుడ్ ఫ్రైడే’ రోజున శిలువేసి చంపేశారు. ఈ విషయాన్ని వియన్నా ఆర్చిబిషప్ క్రిస్టఫ్ క్యథెడ్రల్ శ్యాన్‌బార్న్ ధ్రువీకరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఎలా ధ్రువీకరించుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు.
 
 మార్చి 4వ తేదీన ఏడె

పూర్తి వార్తలు వీక్షించండి
క్రైస్తవులు లక్ష్యంగా లాహోర్‌ దాడి
  • క్రైస్తవులు లక్ష్యంగా లాహోర్‌ దాడి
  • News Postdate
  • News id433
Feature image

- తాలిబన్ల ప్రకటన, 72కు చేరిన మృతుల సంఖ్య
                      లాహోర్‌: లాహోర్‌లో ఈస్టర్‌ పండుగ జరుపుకుంటున్న క్రైస్తవు లను లక్ష్యంగా చేసుకుని తాము ఆత్మాహుతిదాడికి పాల్పడినట్లు పాకిస్తానీ తాలిబన్‌ సంస్థ ప్రకటించింది. సోమ వారం ఉదయం మరో ముగ్గురు క్షతగాత్రులు మరణించ టంతో

పూర్తి వార్తలు వీక్షించండి
నెత్తురోడిన లాహోర్
  • నెత్తురోడిన లాహోర్
  • News Postdate
  • News id431
Feature image

- పార్కులో ఆత్మాహుతి దాడి
- 69 మంది దుర్మరణం
- ఈస్టర్ పండుగపూట విషాదం
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- ఘటనను ఖండించిన ప్రధాని మోదీ

 
లాహోర్: 
పాకిస్తాన్ వాణిజ్య రాజధాని లాహోర్ రక్తపు మడుగైంది. ఆదివారం సాయంత్రం చిన్నపిల్లల పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడితో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 69 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని

పూర్తి వార్తలు వీక్షించండి
21 మంది ఈజిప్షియన్‌ క్రైస్తవులపై ఐఎస్‌ కిరాతకం
  • 21 మంది ఈజిప్షియన్‌ క్రైస్తవులపై ఐఎస్‌ కిరాతకం
  • News Postdate
  • News id422
Feature image

21 మంది ఈజిప్షియన్‌ క్రైస్తవుల ఊచకోత;ఈజిప్ట్‌ ఆగ్రహం ..లిబియాలోని ఐఎస్‌ స్థావరాలపై దాడి;64 మంది ఉగ్రవాదుల హతంకైరో,

ఫిబ్రవరి 16 :
ఐఎస్‌ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. పొట్ట చేతబట్టుకుని ఈజిప్ట్‌ నుంచి లిబియాకు వలస వచ్చిన 21మంది క్రైస్తవులను కిరాతకంగా తలలునరికి చంపారు. ఈ దారుణ దృశ్యాల వీడియోను ఆదివారం విడుదల చేశారు. ఐఎస్‌ ఉన్మాదంపై ఈజిప్ట్‌ తీవ్రం గా స్పందించింది. లిబియాలోని ఐఎస్‌ స్థావరాలపై విమానదాడు లు చేసింది. 64 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈజిప్టు నుంచి ఉపాధి కోసం లిబియాకు వలస వచ్చిన 21మందిని నెల కిందట ఐఎస్‌ ఉగ్రవాదులు క

పూర్తి వార్తలు వీక్షించండి
ఎడాపెడా పిల్లల్ని కనొద్దు : పోప్‌
  • ఎడాపెడా పిల్లల్ని కనొద్దు : పోప్‌
  • News Postdate
  • News id365

కుందేళ్లలా ఎడాపెడా పిల్లల్ని కనొద్దని పోప్‌ ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ క్రైస్తవులను కోరారు. పెళ్లి పరమార్ధం కొత్త జీవులకు జన్మ ఇవ్వడమే అయినా, వారిని బాధ్యతాయుతంగా పెంచగలమా లేదా అనే విషయం కూడా ఆలోచించాలన్నారు. కృత్రిమ గర్భ నిరోధక విధానాలపై చర్చి వ్యతిరేకతను ఆయన సమర్ధించారు. చైనాకు కోపం వస్తుందనే భయంతో టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామాను కలుసుకునేందుకు తాను నిరాకరించానన్న వార్తలను కూడా పోప్‌ తోసిపుచ్చారు. ఆయన కోసం వాటికన్‌ ద్వారాలు ఎపుడూ తెరిచే ఉంటాయన్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
రికార్డు సష్టించిన పోప్‌ ఫ్రాన్సిస్‌ సందేశ కార్యక్రమం
  • రికార్డు సష్టించిన పోప్‌ ఫ్రాన్సిస్‌ సందేశ కార్యక్రమం
  • News Postdate
  • News id363
Feature image

   - అరవై లక్షలమంది హాజరు

మనీలా :
 క్రైస్తవ మత పెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ సందేశ కార్యక్రమం ప్రపంచ రికార్డు సష్టించింది. పిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు అరవై లక్షల మంది ప్రజలు హాజరయ్యి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. ఇది గతంలో 1995 లో ఇదే ప్రాంతంలో నిర్వహించిన జాన్‌ పాల్‌-2 కార్యక్రమం సందర్భంగా నమోదైన రికార్డును అధిగమించింది. ఈ కార్యక్రమానికి యాభై లక్షల మంది హాజరయ్యారు. వాటికన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి 70 లక్షల

పూర్తి వార్తలు వీక్షించండి
నైగర్‌లో 8 చర్చిలు ధ్వంసం
  • నైగర్‌లో 8 చర్చిలు ధ్వంసం
  • News Postdate
  • News id355

- వేర్వేరు దాడుల్లో 10 మంది మృతి,  - చార్లీహెబ్డోపై ఆగని నిరసనలు, ఆందోళనలు, - పత్రిక తీరును ఖండించిన పలు ముస్లిం దేశాలు, - ఫ్రాన్స్‌లో దాదాపు సగం మందిది ఇదే అభిప్రాయం, - భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడే ఉంటాం - ఫ్రాన్స్‌

 నైగర్‌ :
చార్లీహెబ్డో పత్రిక తీరును ఖండిస్తూ పలు దేశాల్లో నిరసనలు, ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఆ పత్రికపై దాడి జరిగాక వెలువడిన తాజా సంచిక కవర్‌ పేజీపైన మహ్మద్‌ ప్రవక్త చిత్రాన్ని ముద్రించిన తీరును పలు ముస్లిం దేశాలు ఖండిస్తూనే ఉన్నాయి. నైగర్‌లో వరుసగా రెండవ రోజు జరిగిన నిరసన ర్యాలీలో ఆందోళన కారులు రెచ్చిపోయారు. ఇనుపరాడ్ల

పూర్తి వార్తలు వీక్షించండి
బాలయేసు విగ్రహంను ఎత్తుకెళ్లి....
  • బాలయేసు విగ్రహంను ఎత్తుకెళ్లి....
  • News Postdate
  • News id333
Feature image

వాటికన్‌సిటి : పాపులను క్షమించే మంచి గుణం యేసు ప్రభువుకు ఉందని క్రైస్తవుల నమ్మకం. ఎంత పెద్ద పాపమయినా.. ఆయన ముందు చెప్ప్పుకుంటే పరిహారం లభిస్తుందనీ.. తన పవిత్ర రక్తంతో ప్రజల పాపాలను కడిగేస్తాడని మత గ్రంధాలు, భోధనలు చెప్తున్నాయి. ఈ మంచితనం వల్లనే క్రైస్తవ మతంకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా క్రిస్మస్‌ పండగ రోజున అతి పవిత్రమైన వాటికన్‌ సిటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఏకంగా బాల యేసు ప్రతిమనే ఓ మహిళ ఎత్తుకెళ్ళింది. క్రైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్‌ సిటీలో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జర

పూర్తి వార్తలు వీక్షించండి
ప్రార్ధనామందిరంపై పాలస్తీనా తీవ్రవాదుల దాడి
  • ప్రార్ధనామందిరంపై పాలస్తీనా తీవ్రవాదుల దాడి
  • News Postdate
  • News id244

జెరూసలెం : జెరూసలెంలో యూదుల ప్రార్ధనా మందిరంపై ఇద్దరు పాలస్తీనియన్‌ తీవ్రవాదులు మంగళవారం గొడ్డళ్లు, కత్తులు, తుపాకులతో విరుచుకుపడ్డారు. వారు విచక్షణా రహితంగా జరిపిన దాడితో... చర్చిలో ప్రార్ధనల్లో నిమగ్నమైన ముగ్గురు అమెరికన్లు, ఒక బ్రిటన్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపారు.

పూర్తి వార్తలు వీక్షించండి
కారుణ్య మరణం సృష్టికి విరుద్ధం : పోప్‌
  • కారుణ్య మరణం సృష్టికి విరుద్ధం : పోప్‌
  • News Postdate
  • News id241

వాటికన్‌ సిటీ : దేవుడి సృష్టికి విరుద్ధంగా మరణాన్ని ఆహ్వానించడం పాపమని పోప్‌ ఫ్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ నయమయ్యే సూచనలు లేవని జాలిపడి రోగి మరణించేందుకు సహకరించవద్దని వైద్యులను కోరారు. మరణించే హక్కు పేరిట జరుగుతున్న ఉద్యమాన్ని పోప్‌ తీవ్రంగా ఖండించారు. అవసరం తీరాక అవతల పడేసే(త్రో అవే కల్చర్‌) సంస్కృతిలో ఇదో భాగమని పోప్‌ విమర్శించారు. అదేవిధంగా అబార్షన్‌, కృత్రిమ గర్భధారణ దేవుడి సృష్టికి విరుద్ధమని, మానవ జీవితాన్ని ప్రయోగశాలగా మార్చవద్దని హెచ్చరించారు. 

పూర్తి వార్తలు వీక్షించండి
యేసుక్రీస్తు వివాహితుడు - సరికొత్త పుస్తకం వెల్లడి
  • యేసుక్రీస్తు వివాహితుడు - సరికొత్త పుస్తకం వెల్లడి
  • News Postdate
  • News id236
Feature image

13-11-2014వ తేదీన ఈనాడు పేపర్‌ 11వ పేజీలో వచ్చిన ఈ వార్తకు.....లండన్‌ : యేసుక్రీస్తు వివాహితుడనీ... అతడికి సంతానం కూడా కలిగిందంటూ ఒక కొత్త పుస్తకం పేర్కొంది. ఆయన మేరీ మాగ్దలేన్‌ను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. 'ది లాస్ట్‌ గాస్పెల్‌' పేరుతో ప్రొఫెసర్‌ బ్యారీ.ఎ.విల్సన్‌, సింషా జాకోబోవిషీలు రాసిన పుస్తకం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎప్పుడో 1847 ప్రాంతంలో ఈజిప్టులోని ఒక క్రైస్తవ ప్రార్ధనా మందిరం నుంచి లండన్‌లోని బ్రిటిషన్‌ గ్రంధాలయానికి వచ్చి చేరిన పురాతన రాతప్రతి 'జోసెఫ్‌ అండ్‌ అసెనెత్‌' ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని రచయితలు పేర్కొన్నారు. ఈ ర

పూర్తి వార్తలు వీక్షించండి
బైజాన్టైన్‌ శకంనాటి మఠాన్ని కనుగొన్న ఇశ్రాయేలు పురాతత్వ శాస్త్రవేత్తలు
  • బైజాన్టైన్‌ శకంనాటి మఠాన్ని కనుగొన్న ఇశ్రాయేలు పురాతత్వ శాస్త్రవేత్తలు
  • News Postdate
  • News id234
Feature image

ఇశ్రాయేలు : ఇశ్రాయేలులోని బేత్‌ షెమెష్‌ ప్రాంతంలో నూతన నివాస నిర్మాణాలను చేపడుతుండగా సుమారు 1000 ఏళ్ళ క్రితంనాటి బైజాన్టైన్‌ శకంనాటి యూధమఠం ఒకటి భూపొరలలో నుండి వెలుగులోకి వచ్చింది. ఇశ్రాయేలీ ఏంటీక్విటీస్‌ అథారిటీ ఈ మధ్యకాలంలోనే జాగ్రత్తగా భద్రపరచబడిన, అతి పెద్దదైన సరిహద్దుగోడను ఒకదానిని బేత్‌ షెమేష్‌లో కనుగొన్నారు. ఆ సంస్థ గత గురువారం ప్రకటించిన దాని ప్రకారం ఈ ప్రాంతం బైజాన్టైన్‌ కాలంలో మఠంలా పనిచేసి వుండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ వెలికి తీత కార్యక్రమానికిని కో-డైరెక్టరైన ఇరేన్‌ జిల్‌బర్‌బాడ్‌, తెహిల్లా లిబ్మన

పూర్తి వార్తలు వీక్షించండి
పాకిస్థాన్‌లో క్రిస్టియన్‌ జంట సజీవదహనం
  • పాకిస్థాన్‌లో క్రిస్టియన్‌ జంట సజీవదహనం
  • News Postdate
  • News id224
Feature image

లాహోర్‌ : తమ పవిత్రగ్రంధం ఖురాన్‌ను కించపరిచారంటూ ఆరోపిస్తూ ముస్లింలు ఓ క్రిస్టియన్‌ జంటను చితకబాది సజీవ దహనం చేసిన సంఘటన మంగళవారం పాకిస్థాన్‌లో జరిగింది. లాహోర్‌కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాసుర్‌ జిల్లాలోని కోట్‌ రాధా కిషన్‌ గ్రామంలో ఇది చోటు చేసుకుంది. బాధితుల బంధువు ఇమ్మానుయేల్‌ సర్పరాజ్‌ మాట్లాడుతూ.. తమ బంధువులు షాహ్జా మాసి (35), ఆయన భార్య షామా (31) లు కొంతకాలంగా ఇక్కడికి సమీపంలో ఉన్న ఛక్‌ గ్రామంలో మహ్మద్‌ యూసుఫ్‌ గుజ్జార్‌ వద్ద సున్నంబట్టీలో పని చేస్తున్నారన్నారు. ఆ జంట నలుగురి పిల్లలతో కలిసి సున్నంబట్టీ వదిలి వెళ్లడానికి నిర

పూర్తి వార్తలు వీక్షించండి
యేసు సంస్మరణ నాణెంపై ఓ అక్షర దోషం
  • యేసు సంస్మరణ నాణెంపై ఓ అక్షర దోషం
  • News Postdate
  • News id223
Feature image

వాటికన్‌ : పోప్‌ ఫ్రాన్సిస్‌ మతాధికారాన్ని తెలియజేయు సంస్మరణ నాణెంపై యేసు నామం అక్షర దోషంతో ముద్రించబడడంతో ఈ విషయం తెలుసుకున్న తరువాత వాటికన్‌ ఆ నాణేలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేసింది. ఇటాలియన్‌ స్టేట్‌ మింట్‌చేత తయారు చేయబడిన ఈ నాణెంపై ఒక ప్రక్క పోప్‌ ఫ్రాన్సిస్‌ బొమ్మతోపాటు "Franciscus Pont.Max.An.I." అని ముద్రించబడగా, రెండవ ప్రక్కన యవ్వనస్తుడైన జార్గీ మేరియో బెర్గాగ్లియోను ప్రభావితం చేసి, అతడు దేవుని పరిచర్యకు పిలవబడడానికి కారణమైన వాక్యమొకటి వ్రాయబడింది. కేథలిక్‌ చర్చ్‌ ప్రకారం ఆ వాక్యం వాస్తవానికి ఏదంటే "Vidit ergo Jesus publicanumet quia miserando atque eli

పూర్తి వార్తలు వీక్షించండి
గ్లోబల్‌ తెలుగు క్రిస్టియన్‌ మినిస్ట్రీస్‌ రీజనల్‌ కాన్ఫెరెన్స్‌
  • గ్లోబల్‌ తెలుగు క్రిస్టియన్‌ మినిస్ట్రీస్‌ రీజనల్‌ కాన్ఫెరెన్స్‌
  • News Postdate
  • News id213

ఫోర్ట్‌ బ్లెయిర్‌ : అక్టోబర్‌ 10,11 తేదీలలో జి.టి.సి.ఎమ్‌.గ్లోబల్‌ తెలుగు క్రిస్టియన్‌ మినిస్ట్రీస్‌ రీజనల్‌ కాన్ఫరెన్స్‌ అండమాన్‌ నికోబార్‌ దీవులలో జరిగింది. 120 తెలుగు క్రైస్తవ సంఘము ద్వారా 300 మంది విశ్వాసులు ఈ సమావేశములో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి రాజమండ్రి, నిడదవోలు, విజయవాడ, గుడివాడ నుండి 10 మంది ఈ సమావేశమునకు హాజరైరి. ఈ కార్యక్రమములో సంఘ ప్రతిష్ఠత, సంఘ నాయకులు, విశ్వాసము మొదలగు ప్రత్యేక అంశముల గూర్చి తెలియజేశారు. జి.టి.సి.ఎమ్‌.సంస్థకు ప్రెసిడెంట్‌గా అపో||రెవ.డా||లివింగ్‌ స్టర్‌ గద్దె, వైస్‌ ప్రెసిడెంట్‌గా డా||జోసఫ్‌ పాతూరి, ప్

పూర్తి వార్తలు వీక్షించండి
రష్యాలో 750 ఏళ్లనాటి నగరం అవశేషాలు
  • రష్యాలో 750 ఏళ్లనాటి నగరం అవశేషాలు
  • News Postdate
  • News id212

మాస్కో : రష్యాలోని వోల్గా నది వెంబడి 750 సంవత్సరాల నాటి యుకెక్‌ నగరం అవశేషాలను తవ్వకాల్లో గుర్తించారు. ఈ నగరాన్ని చంఘిజ్‌ ఖాన్‌ మనవడు బటుఖాన్‌ నిర్మించినట్లుగా పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. వారి తవ్వకాల్లో గుర్తించిన రెండు క్రైస్తవ దేవాలయాల్లో ఒకదాన్ని రాతిని తొలిచి నిర్మించారు. 1227లో చంఘిజ్‌ ఖాన్‌ మరణించిన కొన్ని థాబ్దాలకే ఈ నగరాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు.

పూర్తి వార్తలు వీక్షించండి
తక్షణ చర్యలు తీసుకోకపోతే డిసెంబర్‌ నాటికి వేల సంఖ్యలో మరణాలు
  • తక్షణ చర్యలు తీసుకోకపోతే డిసెంబర్‌ నాటికి వేల సంఖ్యలో మరణాలు
  • News Postdate
  • News id206
Feature image

తాజా అధ్యయనం హెచ్చరిక
వాషింగ్టన్‌ :
ప్రపంచ దేశాలు తక్షణ చర్యలు తీసుకోని పక్షంలో ఇప్పటికే పశ్చిమ ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలకు విస్తరించిన ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా డిసెంబర్‌ నెల మధ్య నాటికల్లా ప్రబలిపోయి వేలాది మంది చనిపోవడానికి కారణం కావచ్చని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికాలోని యేల్‌ యూనివర్శిటీలోని స్కూల్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌కు చెందిన ఏడుగురు శాస్త్రవేత్తల బృందం ఈ అంటువ్యాధి వ్యాపిస్తున్న తీరుకు సంబంధించి గణితపరమైన ఓ విధానాన్ని రూపొందించి లైబీరియా ప్రాంతంలో ఇప్పటికే ఎబోలా వ

పూర్తి వార్తలు వీక్షించండి
అవినీతి జాడ్యాన్ని నిర్మూలించాలి ; పోప్‌ ఫ్రాన్సిస్‌
  • అవినీతి జాడ్యాన్ని నిర్మూలించాలి ; పోప్‌ ఫ్రాన్సిస్‌
  • News Postdate
  • News id204
Feature image

రోమ్‌ : అన్ని రకాల అవినీతిని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఖండించారు. పెద్ద మొత్తంలో ఆర్థిక, సామాజిక నష్టం కలిగించే విధంగా నేరాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు క్రిమినల్‌ చట్టాలను కఠినతరం చేయాలని నొక్కి చెప్పారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపించే నేరాలకు, ప్రజాపాలనలో అవకతవకలకు లేదా అవినీతికి పాల్పడటాన్ని తీవ్ర నేరాలుగా పరిగణించి కఠినంగా శిక్షించాల్సిన అవసరాన్ని పోప్‌ నొక్కి చెప్పారు. వాటికన్‌సిటీలో ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ క్రిమినల్‌ లా ప్రతినిధి బృందం శుక్రవారం నాడు పోప్‌ను కలిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోప్‌ పై విధంగా అన్నట్లు

పూర్తి వార్తలు వీక్షించండి
బుల్లెట్లను ఎదురించి ప్రాణాలను కాపాడిన బైబిల్‌!
  • బుల్లెట్లను ఎదురించి ప్రాణాలను కాపాడిన బైబిల్‌!
  • News Postdate
  • News id192

అమెరికా : పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ నుంచి శరీరంలోకి బుల్లెట్‌ దించితే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. కాని రెండు సార్లు పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ నుంచి ఛాతిలోకి బుల్లెట్లతో కాల్పులు జరిపినా బైబిల్‌ అడ్డుకోవడంతో ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అమెరికాలోని ఒహియోలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న రికీ వాగనెర్‌పై దుండగులు అతి సమీపం నుంచి ఛాతిలోకి కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్లను తన పాకెట్‌లో ఉన్న "ది మెస్సెజ్‌" పేరుతో ఉన్న బైబిల్‌ ప్రాణాలను కాపాడింది. లేకుంటే ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయేవని

పూర్తి వార్తలు వీక్షించండి