తాజా వార్తలు

దైవసేవకుల సంక్షేమ పథకం ద్వారా ఆర్ధిక సహాయం

గోకవరం : తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన దైవసేవకుల సంక్షేమ పథకం ద్వారా జిల్లాలో ఎవరైనా దైవసేవకులు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆదరణకరంగా 50 వేల రూపాయల నగదును అందిస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా జనరల్‌ సెక్రెటరీ రెవ.జుహాని హలోనెన్‌ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు మందికి పైగా దైవ సేవకులు దీనిలో సభ్యులుగా ఉన్నారని తెలియజేశారు. గడచిన సంవత్సరం నుండి ఇప్పటి  వరకు 53 కుటుంబాలకు అనగా 26 లక్షల 50 వేల రూపాయలు అందజేశామని తెలిపారు. 2020 సెప్టెంబర్‌ 9వ తేది, బుధవారం, రంపచోడవరంకి చెందిన ముర్ల మల్లేశ్వరరావు మరణించిన సందర్భంలో అతని భార్య భీమమ్మకు 50వేల రూపాయలు అందజేశారు. కృష్ణునిపాలెం ఇ.హెచ్‌.హెచ్‌.చర్చ్‌ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైస్‌ ప్రెసిడెంట్  బిషప్‌ డా.  మోజస్‌, రీజినల్‌ చైర్మన్‌ జకరయ్య పాల్గొన్నారు. ఆర్ధిక సహాయము అందుకున్న కుటుంబ సభ్యులు, పేద సేవకులను ప్రేమించి ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బిషప్‌ డేనియేల్‌ పాల్‌, జిల్లా జనరల్‌ సెక్రెటరీ రెవ.జుహాని హలోనెన్‌, ట్రెజరర్‌ రెవ.టాటా  విక్టర్‌, ఎగ్జిక్యూటీవ్‌ సెక్రెటరీ రెవ.సామ్యూల్‌ సాగర్‌ మరియు కమిటి  సభ్యులందరికీ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు