తాజా వార్తలు

హిజ్రాలకు నిత్యవసర వస్తువులు పంపిణి

గోకవరం : కుల, మత, లింగ, వర్ణ భేదములు కతీతంగా ప్రతి మనిషిని ప్రేమించాలని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని ఫెయిత్‌ ఇవాంజికల్‌ మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ రెవ.జుహాని హలోనెన్‌ అన్నారు. సమాజంలో తృణీకరించబడిన వారిగా ఉన్న హిజ్రాలను ఆహ్వానించి వారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలోని ఈ.హెచ్‌.హెచ్‌.చర్చ్‌ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ రెవ.జుహాని హలోనెన్‌ మ్లాడుతూ హిజ్రాలలో ఎవరైనా స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్ళమీద తాము నిలబడాలని అనుకుంటే సంస్థ ద్వారా వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. హిజ్రాలు మాట్లాడుతూ  సమాజంలో తమని చిన్నచూపు చూసే వారే తప్ప ఆదరించే వారు లేరని వాపోయారు. అయితే ఫెయిత్‌ ఇవాంజికల్‌ మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ రెవ. జుహాని హలోనెన్‌ తమను ఎంతో గౌరవంగా ఆహ్వానించి ఆదరించి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంత మంచి మనసు కలిగిన రెవ.జుహాని హలోనెన్‌కి మరియు వారి కుటుంబానికి రుణపడి ఉంటామని తెలియజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు