తాజా వార్తలు

ప్రభువు నందు నిద్రించిన షారోన్‌ క్రీష్టియన్‌ బుక్‌ సెంటర్‌ అధినేత పి.ఎల్‌.రాజు

కాకినాడ : ఉభయ తెలుగు రాష్ట్రాలలో, క్రైస్తవ సాహిత్య ముద్రణా రంగంలో పరిచయం లేని వ్యక్తి, కిక పేదరికంలో ప్టుిన తనకు తన తల్లిదండ్రులు 'రాజు' అని పేరు ప్టోరు. ఆ పేరును సార్ధకం చేస్తూ 'రాజుగారి' స్థాయికి ఎదిగిన ఒకప్పి అతి సామాన్యుడు. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతికితే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు అనడానికి నిలువెత్తు సాక్ష్యం షారోన్‌ బుక్‌ సెంటర్‌, ప్రింటర్స్‌ వ్యవస్థాపకులు పెదపాి లోవరాజు (షారోన్‌ రాజు).

ఈయన 2020 సెప్టెంబర్‌ 6వ తేదిన ప్రభువు నందు నిద్రించారు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు రాజేష్‌, మోజెస్‌, కుమార్తె బేబి ఉన్నారు. ఆయన షారోన్‌ బుక్‌ సెంటర్‌లో షారోన్‌ అను పేరును తన ఇంి పేరుగా మార్చుకొని షారోన్‌ రాజుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాహిత్య ప్రియులకు పరిచయమే. ఈయన 1950 సం||లో తూ||గో||జిల్లా ఉండూరు గ్రామములో జన్మించారు. 1979లో భాగ్యలక్ష్మి గారితో వివాహం జరిగింది. కాకినాడ హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ సంఘ కాపరి రెవ.డా||విజయకుమార్‌ ద్వారా రక్షింపబడి బాప్తిస్మము తీసుకున్నారు. చిన్నగా డెబ్బై రూపాయలు పెట్టుబడితో ప్రారంభించిన బైబిలు కవర్లు క్టుి అమ్ముకొనే వ్యాపారము చేసేవారు. దేవుడు బహుగా ఆశీర్వదించి 1994 సం||లో కాకినాడ, రామారావు పేటలో స్థలం తీసుకొని దానిలో షారోన్‌ క్రిష్టియన్‌ బుక్‌ సెంటర్‌ ప్రారంభించారు. బుక్‌ సెంటర్‌ని అభివృద్ధి పర్చుతుండగానే, బుక్స్‌ ప్రింంగ్‌ చేయడం మొదలు ప్టిె అనేక మంది దైవజనుల జీవిత చరిత్రలను ప్ర్‌ిం చేసి ఆంధ్రప్రదేశ్‌ అంతా అమ్ముతుండేడివారు. తదుపరి షారోన్‌ ప్రింంగ్‌ ప్రెస్‌ ప్టిె క్రైస్తవ సాహిత్యము ముద్రించడములో షారోన్‌ మొదట నిలుస్తున్నది. దీనికి అంతికి కారణము దేవుడైతే, షారోన్‌ రాజు భక్తి జీవితము, రాత్రినక, పగలనక కష్టించి అభివృద్ధి పర్చారు.

ఆయన మృతి పట్ల ఉభయరాష్ట్ర క్రైస్తవులు ద్రిగ్భాంతికి గురైనారు. ప్రముఖ క్రైస్తవ నాయకులు, స్థానిక సంఘసభ్యులు, స్నేహితులు, బంధువులు, షారోన్‌ బుక్‌స్టాల్‌ అభిమానులు తమ సంతాపము తెలియజేసారు. విడవబడిన కుటుంబమునకు దేవుని కృప, కాపుదల తోడుగా ఉండాలని ప్రార్ధించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు