తాజా వార్తలు

నిరుపేదకుటుంబమునకు సాయం అందించిన షాలేమ్ గాస్పెల్ ప్రార్థనా మందిరం సేవకులు

పిఠాపురం : దేశంలో పేదరికం నిర్మూలన అవ్వాలంటే ఒక్క ప్రభుత్వాల తోనే సాధ్యం అవ్వదు.  ఆర్థికంగా మెరుగ్గా ఉన్న ప్రతి మానవుడు పెద్ద  మనసు చేసుకుని దానవుడుగా మారితే గాని పేదరిక నిర్మూలన భారతదేశాన్ని వదిలి వెళ్ళదు. కానీ ప్రతి మానవుడు దాచుకునేవాడు అవుతున్నాడు గాని దానవుడు కాలేక పోతున్నాడు అందుకే పేదరికం మనదేశంలో ఏదో మూలన మూలుగుతూనే  ఉన్నది కానీ షాలేమ్ గాస్పల్ ప్రార్థనా మందిరం పాస్టర్ టి . కరుణ్ రాజు సహాయముపడడంలో తనకు తానే సాటి అనిపించికుంటారని. ఆయన ఇదివరకు పిఠాపురం పాస్టర్స్ ఫెలోషీప్ కి సెక్రెటరీగా ఎనలేని సేవలు చేసి మన్ననలు పొందిన కరుణ్ రాజు  మానవతా దృక్పథంతో నేను చెప్పిన వెంటనే యానాది కాలనీ నిరుపేద కుటుంబమునకు నిత్యవసర వస్తువులు, కాయకూరలు, బియ్యం పంపిణీ చేసి నందుకు పాస్టర్ కరుణ్ రాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఈ కార్యక్రమాల్లో ఉన్న దళిత హక్కుల పోరాట సమితి నియోజవర్గ కన్వీనర్ ఎస్. రామకృష్ణ  అన్నారు. ఈ కార్యక్రమంలో టి .షాలేమ్ రాజు, చెరుకూరు గణపతి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు