తాజా వార్తలు

సంక్షేమ పథకము ద్వారా ఆర్ధిక సహాయము

రాజమండ్రి : గత రెండు సంవత్సరములుగా ఒక అద్భుతమైన సంక్షేమ పథకము ద్వారా ఒక్క తూ. గో. జిల్లాలో మాత్రమే పాస్టర్స్‌కు సేవకుని సంక్షేమ పథకము ద్వారా మరణించిన దైవసేవకుల కుటుంబమునకు 50 వేల రూ.  ఆర్ధిక సహాయము అందిస్తున్నారు. ఈ పథకము ద్వారా అనేక మంది సేవకుల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. విడవబడిన కుటుంబములకు మేము వున్నామంటూ తూ. గో. జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సభ్యులు అండగా వుండి ప్రార్ధన చేస్తున్నారు. తూ. గో. జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సేవకుని సంక్షేమ పథకము ఆంధ్రరాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు బిషప్‌ ప్రతాప్‌ సిన్హా, తూ. గో. జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు బిషప్‌ డా.  డేనియేల్‌ పాల్‌ ఆధ్వర్యములో రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సభ్యులు మరియు సేవకుని సంక్షేమ పథకములో సభ్యులుగా వున్న ఇద్దరు దైవసేవకులు పాస్టర్‌ చింతాడ ఆశీర్వాదము, పాస్టర్‌ పేరలి రమేష్‌ గార్లు గత కాలంలో మహిమ ప్రవేశము చేసారు. వారి కుటుంబములకు 2020 సెప్టెంబర్‌ 3వ తేదిన గురువారం ఉ.  10 గంటలకు ఎ.వి.ఎ.రోడ్‌, చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ ఆఫ్‌ నెతన్యా చర్చ్‌లో రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు రెవ.డా.  కె.సుధీర్‌ కుమార్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమములో బిషప్‌ ప్రతాప్‌ సిన్హా వాక్యసందేశమును అందించగా, బిషప్‌ డి.శుభాకర్‌ శాస్త్రి, రెవ.టాటా విక్టర్‌, రెవ.గిద్యోను ఆదరణ మాటలు తెలియజేసారు. బిషప్‌ డా. కె.ఎలీషా ముగింపు ప్రార్ధన, ఆశీర్వాదము చేసారు. ఇద్దరి దైవసేవకుల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 50 వేలు రూ.  చొప్పున నాయకులు కుటుంబములకు అందించారు. ఈ కార్యక్రమములో రెవ.విజయసారధి, రెవ.జాన్‌ ప్రసాద్‌, మండపేట ఆఫీస్‌ నుండి రెవ.డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు