తాజా వార్తలు

IFJ ప్రార్ధనా ఉద్యమం

రాజమండ్రి : దేవుని మహాకృపను బట్టి 2020 సెప్టెంబర్‌ 1వ తేది, మొదటి మంగళవారం ఉ. 9.30 ని. ల నుండి మ.  1 గంట వరకు ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌, క్వారీ మార్క్‌ట్  సెంటర్‌, రాజమండ్రిలో IFJ విజ్ఞాపన ప్రార్ధనలు బహుదీవెనకరముగా జరిగెను. ఈ విజ్ఞాపన కూడికకు ఉభయగోదావరి జిల్లాల నుండి IFJ సేవకులు మరియు అనేక మంది దైవజనులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దేశ ప్రజల రక్షణ కొరకు, క్షేమము కొరకు దైవసేవకులందరు మోకరించి కన్నీటితో దేవునికి మొఱ్ఱపెట్టిరి . దేశంలో కరోనా సంపూర్ణంగా నిర్మూలమైపోవాలని, కరోనా లేని భారతదేశం కావాలని, మహారోధనలు చేసిరి. దైవజనులు పీటర్‌ పరిశుద్ధాత్మ పూర్ణులై అందించిన వాక్యసందేశము ద్వారా సేవకులందరు బహుగా బలపరచబడి, ఉజ్జీవింపబడిరి. దైవజనులు మార్టిన్‌ అన్న అధ్యక్షతన క్రమముగా జరిగింది. బ్రదర్‌ విజయబాబు ఆహ్వానము మేరకు అనేక మంది సేవకులు పాలుపొందిరి. అనంతరము వచ్చిన దైవజనులందరికి చక్కని ప్రేమ విందు సమృద్ధిగా అందించిరి. ప్రతి నెల మొదటి  మంగళవారము రాజమండ్రిలో జరుగబోవు IFJ విజ్ఞాపనోద్యమానికి దైవజనులందరిని ప్రేమతో ఆహ్వానించారు. దైవజనులు జి.శాంసన్‌ రాజు, దైవజనులు డేవిడ్‌అన్న, దైవజనులు డేవిడ్‌ ఫ్రాన్సిస్‌ ఇంకా అనేక మంది దైవజనులు పాలుపొంది దేవుని మహిమ పరిచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు