తాజా వార్తలు

రెవ.డాదేవరపల్లి విజయ సునంద్‌ జ్ఞాపకార్థ కూడిక

రాజమండ్రి : బైబిలు ప్లేస్‌ అధినేత, బిషప్‌ జోసఫ్స్‌ చర్చ్‌ పాస్టర్‌ బిషప్‌ జోసఫ్‌, శ్రీమతి వినుతి జోసఫ్‌ గార్ల ఏకైక కుమారుడు రెవ.డా.దేవరపల్లి విజయ సునంద్‌ 2020 ఆగష్టు 21వ తేదిన ప్రభువు నందు నిద్రించారు. వారి జ్ఞాపకార్థ కూడిక ఆగష్టు 27వ తేదిన ఉ.  10 గంటలకు ఎ.వి.ఎ.రోడ్‌, రాజమండ్రి, బైబిలు ప్లేస్‌ గ్రౌండ్స్‌ నందు దేవుని నామమునకు మహిమకరముగా జరిగింది. ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రెసిడెంట్ బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా అధ్యక్షత వహించారు. రెవ.డా. కె.సుధీర్‌కుమార్‌, శ్రీమతి రెవ.డా. నిర్మల ప్రశాంత్‌ కుమార్‌ దైవసందేశములు అందించారు. శ్రీమతి రెవ.లత సుధీర్‌కుమార్‌ ప్రార్ధన చేసారు. రెవ. టాటా విక్టర్‌, బిషప్‌ శుభాకర్‌ శాస్త్రి, రెవ.వి.ఎస్‌.సి.ప్రసాద్‌, రెవ.జాన్‌ సునందన్‌, బ్రదర్‌ దివాకర్‌, బ్రదర్‌ డి.జె.అబ్రహాం, రెవ.యం.ప్రకాష్‌, రెవ.కె.సామ్యేల్‌, రెవ.కె.విజయరావు, రెవ.యం.యస్‌.అరుణ భాస్కర్‌, బ్రదర్‌ వై.రాజు ఆదరణ మాటలు చెప్పి రెవ.డా. దేవరపల్లి విజయ సునంద్‌ చేసిన సేవలను, వారి వ్యక్తిత్వమును కొనియాడారు. అనంతరము బిషప్‌ జోసఫ్‌, శ్రీమతి వినుతి జోసఫ్‌ గార్ల మనుమలు రెవ.డా. విజయసునంద్‌, శ్రీమతి సోని సునంద్‌ గార్ల కుమారులు బ్రదర్‌ విజయజోసఫ్‌, బ్రదర్‌ జోసఫ్‌ దేవదాసులను ఈ కార్యక్రమములో దైవజనులందరును దైవ సేవకులుగా అభిషేకించారు. సంఘ విశ్వాసులు, దైవసేవకులు ఏకీభవించి వారి తాతగారు మాదిరిగా మంచి పరిచర్య చేయాలని ఇద్దరు సేవకులుగా, దేవునికి మహిమకరముగా జీవించి మంచి పరిచర్య చేయాలని ప్రార్ధించి ఆశీర్వదించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు