జాతీయం

కొత్త మలుపు తిరిగిన టెక్కీ మర్డ్‌ర్‌ కేసు

 ముంబైలో దారుణ హత్యకు గురైన టెక్కీ ఎస్తేర్‌ అనుహ్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన చంద్రబాన్‌ నిందితుడు డిఎన్‌ఎకు మృతురాలి శరీరంలో లభించిన డిఎన్‌ఎకు సరిపోలడం లేదంటూ మహారాష్ట్ర ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టం చేసింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్‌ అనుహ్య ముంబై నుంచి డిసెంబర్‌లో క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికొచ్చిన ఈమె జనవరి ఫస్ట్‌వీక్‌లో ముంబైకి వెళ్ళింది. ముంబై రైల్వేస్టేషన్‌లో దిగిన అనుహ్య అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆమె ఆచూకీ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. చివరకు పేరెంట్స్‌, బంధువులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. కంజూర్‌మార్గ్‌ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం తన కూతురిదేనని ఆమె తండ్రి గుర్తించాడు. డెడ్‌బాడీ లభించడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చంద్రబాన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. తాజాగా అనుహ్య డిఎన్‌ఎకి... చంద్రబాన్‌ డిఎన్‌ఎ సరికాకపోవడంతో ముంబై పోలీసులకు మళ్ళీ చెమటలుపడుతున్నాయి. ఈ కేసును ఇప్పుడు ఏ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టాలా అనేది పెద్ద మిస్టరీగా మారింది. కేసును తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాన్‌ని ఇరికించారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ముంబై పోలీసుల వ్యవహారశైలిని వారు దుయ్యబడుతున్నారు. 


 తాజా వీడియోలు 
తాజా వార్తలు