తాజా వార్తలు

కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు..!

రహదారికి లోతుగా ఉన్న పాత ప్రార్థనా మందిరాన్ని కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు లేపే కార్యక్రమాన్ని పార్వతీపురంలో సోమవారం చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని బైపాస్‌ కాలనీ రోడ్డులో కొన్నేళ్ల క్రితం నిర్మించిన ప్రార్ధనా మందిరం, రహదారికి చాలా లోతుగా ఉండడంతో కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు, 120 జాకీల సాయంతో హర్యానా రాష్ట్రానికి చెందిన శ్రీరామ్‌ బిల్డింగ్‌ లిఫ్టింగ్‌ అండ్‌ షిఫ్టింగ్‌ కంపెనీ లో పని చేస్తున్న బీహార్‌ రాష్ట్రానికి చెందిన పాట్నా రాజధాని భాగల్పూర్‌ కి చెందిన కార్మికులు భవన సముదాయం ఎత్తు చేసే పనిలో నిమగమై ఉన్నారు. ఈ పనులను చూసేందుకు పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. భవన వైశాల్యంలో చదరపు అడుగు కి 250 రూపాయల చొప్పున భవన యజమాని చెల్లించవలసి వస్తుంది. 40 రోజులలో 10 మంది కార్మికులు భవన సముదాయపు మొత్తం పనులను పూర్తి చేస్తామని కార్మికులు తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు