అంతర్జాతీయం

రూ.17,924 కోట్ల క్రిస్మస్‌ లాటరీ

మాడ్రిడ్‌: ప్రపంచంలో అతిపెద్ద లాటరీగా గుర్తింపు పొందిన స్పెయిన్‌లోని ‘ఎల్‌ గోర్డో’ లక్కీ డ్రా విజేతలను శుక్రవారం ప్రకటించారు. 71198 నంబర్‌ టికెట్‌ను కొనుగోలుచేసిన వారిని అదృష్టం వరించడంతో వారికి సుమారు 30 కోట్ల చొప్పున విలువైన బహుమతులు దక్కనున్నాయి. ఇదే నంబర్‌ గల టికెట్‌ గరిష్టంగా 165 మంది దగ్గర ఉండొచ్చు. మిగతా విజేతలకు కూడా వారి టికెట్‌ సంఖ్య ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో బహుమతులు ఇస్తారు. దేశవ్యాప్తంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ లక్కీ డ్రాను ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు. ఈసారి విజేతలకు మొత్తం సుమారు రూ.17924 కోట్ల బహుమతులు పంచనున్నారు. గతేడాది కన్నా ఇది 3 శాతం అధికం. ఎల్‌ గోర్డో ద్వారా లభించే మొత్తం ప్రైజ్‌మనీ ఇతర లాటరీల కన్నా ఎక్కువ. అందుకే  1812 నుంచి ఏటా డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ సందర్భంగా ప్రజలు ఈ డ్రాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు