గుంటూరు

క్రైస్తవులపై దాడులకు నిరసనగా ర్యాలీ

గుంటూరు : క్రైస్తవులపై జరుగుతున్న భౌతిక మానసిక దాడులకు నిరసనగా సోమవారం ఆలిండియా ట్రూ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ అధ్యకక్షుడు బి.సంగీతరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శంకర్‌ విలాస్‌, ఎసి కాలేజ్‌, నగరం పాలెం మీదుగా జిల్లా పరిషత్‌ కార్యలయం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న నేతలు జిల్లా జాయ్‌ిం కలెక్టర్‌, జిల్లా ఎఎస్పిలకు వినతి పత్రం సమర్పించారు. ర్యాలీలో జిల్లా ఎఐిసిసి గౌరవాధ్యకక్షులు బి.జయపాల్‌, కె.అనిల్‌ కుమార్‌, ఎం.ప్రశాంతకుమార్‌, బి.బాబ్జి, జయరాజ్‌, అంజిబాబు, బెంజిమన్‌, లూథర్‌బాబు, పాస్టర్లు చంద్రపాల్‌, యేసురత్నం, రమేష్‌, ి.సిమోను, కె.రాము, ఇ.శాంతి సంతోష్‌ పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు