తాజా వార్తలు

క్రైస్తవులపై దాడులు అరిక్టాలి

కాకినాడ : క్రైస్తవులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై వివిధ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రైస్తవులపై దాడుల్ని తక్షణం అరిక్టాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ే వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో దాడులపై నిరసన తెలిపారు. నాయకులు మ్లాడుతూ అధికమవుతున్న మతోన్మాద ధోరణుల వల్ల ప్రపంచ వ్యాప్తముగా దేశానికి చెడ్డ పేరువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన అనంతరం కలెక్టర్‌ే నుంచి ఇంద్రపాలెం వంతెన వరకూ ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమములో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యకక్షుడు అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌, క్రిస్టియన్‌ యూత్‌ ఫెలోషిప్‌ డైరెక్టర్‌ మూర్తిరాజు, రక్షణ ి.వి. సిఎండి జక్కుల బెన్‌హర్‌, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌ నాయకులు కాశి బాలయ్య, రాజ భూషణం, జార్జి ముల్లర్‌, కిరణ్‌పాల్‌ పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 




తాజా వార్తలు