తూర్పుగోదవరి

ఘనంగా ఎపి ప్రేయర్‌ ీం క్రిస్మస్‌ ఆరాధన

రాజమండ్రి : బొమ్మూరులోని నేతాజీనగర్‌లో డిసెంబర్‌ 5వ తేది రాత్రి రాష్ట్ర ఎపి ప్రేయర్‌ ీం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ఆరాధన ఘనంగా జరిగింది. ప్రభుత్వ ట్రైనింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ డా||ఆర్‌.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాస్టర్‌ జె.జొనాతన్‌ (వైజాగ్‌), పాస్టర్‌ ఎస్‌.శామ్యూల్‌ (పాలకొల్లు) లు క్రిస్మస్‌ వర్తమానం అందించారు. బ్రదర్‌ కె.ప్రకాష్‌ అండ్‌ బ్రదర్స్‌ సంగీత సారధ్యంలో పెరుక మోజెస్‌ ఆలపించిన గీతాలు అలరించాయి. రత్నం నర్సింగ్‌ కళాశాల చైర్మన్‌, గిడియన్‌ ఇంటర్నేషనల్‌ సభ్యుడు, ప్రముఖ వైద్యుడు వైనల్‌ వాల్టర్‌ మాడేను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న డ్‌ై ప్రిన్సిపాల్‌ ఎ.జయప్రకాశరావు, రాజమహేంద్రవరం డివైఇవొ ఎస్‌.అబ్రహం, ఓగూరి ాంటన్‌ రాజు తదితరులు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎ.పి.ప్రేయర్‌ ీం ముఖ్య నాయకులు పాస్టర్‌ బి.దానియేలు, పాస్టర్‌ సిహెచ్‌.రాజా, పాస్టర్‌ పి.హర్షకుమార్‌, పాస్టర్‌ జి.శేఖర్‌, బ్రదర్‌ ఎన్‌.డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు