హైదరాబాద్

మైనారిటీలు చట్ట సభల వైపు అడుగులేయాలిరాజ్యసభ సభ్యులు అలీ అన్వర్‌ అన్సారీ

ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ ఆవిర్భావం

హైదరాబాద్‌ : భారత ప్రజాస్వామ్యంలో థాబ్దాలుగా దళిత క్రైస్తవులు, ముస్లింలపై మతపరమైన వివక్ష కొనసాగుతోందని రాజ్యసభ సభ్యులు అలీ అన్వర్‌ అన్సారీ (బీహార్‌) అన్నారు. నిరాశ, నిస్పృహలకు గురైన ఆ వర్గాలే ఇండియన్‌ క్రిస్టియన్‌ సెక్యులర్‌ పార్టీ (ఐసిఎస్‌పి) ప్రారంభించాయని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ సభ శుక్రవారం నిజాం కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. అన్సారీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌లు ముఖ్య అతిధులుగా హాజరై పార్టీ పతాకాన్ని, ఎన్నికల చిహ్నాన్ని ఆవిష్కరించారు. అన్సారీ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం దేశంలో 29వ రాష్ట్రం పురుడు పోసుకుంది. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమంటే ఒక సవాలు వంటిదన్నారు. పార్లమెంటు జరిగినంత కాలం దళిత క్రైస్తవులు, ముస్లింల సమస్యల పరిష్కారం కోసం హక్కుల పరిరక్షణకు నిరసనలు చేశామన్నారు. సంఖ్యా బలం తక్కువ ఉండటంతో ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో తమ వాణి వినిపించలేకపోయామన్నారు. అభివృద్ధి ఫలాల కోసం క్రైస్తవులు, ముస్లిం మైనారిటీలంతా చైతన్యులై చట్టసభల వైపు అడుగులు వేయాలని కోరారు. మాజీద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. ఐసిఎస్‌పికి ఎంఐఎం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందని చెప్పారు. క్రైస్తవుల హక్కుల కోసం కొందరు ధైర్యం చేసి పార్టీని పెట్టారు. వారిని ఆదరించండి.. గౌరవించండి.. లేకపోతే బానిసత్వం నుంచి విముక్తి పొందలేమన్నారు. క్రైస్తవులను చట్టసభలకు పంపించాలనే సంకల్పంతోనే పార్టీ పెట్టినట్లు పార్టీ జాతీయ అధ్యకక్షులు ఎం.ఉదయ్‌కుమార్‌ వివరించారు. మౌనంగా ఉంటే ఈ వివక్ష ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. రాజకీయ వేదిక ద్వారా మన హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. సభలో పార్టీ జాతీయ సెక్రటరీ జనరల్‌ పాల్‌ దేవప్రియం పుల్లా, ఉపాధ్యకక్షులు బాల్‌రెడ్డి, స్లీవా గెలలీ, కోశాధికారి రెవ.డా||కరుణశ్రీ దాసరి, కార్యదర్శి, యువజన విభాగం ఇన్‌ఛార్జి, నటుడు రాజా, కార్యదర్శి ఎం.సాల్మన్‌రాజ్‌, స్టాన్లీబాబు, కె.ఆర్‌.డబ్ల్యూ యేసుదాస్‌, జోగిందర్‌సింగ్‌, ప్రొ.గాలి వినోద్‌కుమార్‌, బిషప్‌ మార్టిన్‌, డా||బి.జె.వినయ్‌స్వరూప్‌, ఉషాపాల్‌ పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు