తూర్పుగోదవరి

ఘనముగా జరిగిన రత్నం నర్సింగ్‌హోమ్‌ 30వ క్రిస్మస్‌

రాజమండ్రి : రెవ.డా||లైనల్‌ వాల్డర్‌ మాడే ఆధ్వర్యంలో డిసెంబర్‌ 1వ తేది సాయంత్రం 5.30 ని||లకు స్థానిక కోర్లమ్మపేట, ప్రభుత్వ పశువుల హాస్పిటల్‌ ఎదురుగా గల రత్నం నర్సింగ్‌ హోమ్‌ 30వ వార్షికోత్సవము మరియు క్రిస్మస్‌ వేడుక ఘనముగా జరిగాయి. ఈ కార్యక్రమ మునకు అధ్యకక్షులుగా డా||ఆర్‌. నాగేశ్వరరావు, బిషప్‌ ఈస్ట్‌ గోదావరి సినడ్‌ రెవ.కె.జేసుదాసు ఆరాధనలో నడిపించారు. ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్‌ సిహెచ్‌. సంతోష్‌రెడ్డి, గౌరవ అతిధులుగా రెవ. శ్రీకాంత్‌జేమ్స్‌, రాజమండ్రి మేయర్‌ శ్రీమతి పంతం రజని కొండలరావు, శ్రీమతి లయన్‌ నేరెళ్ళ జయశ్రీ, ఆత్మీయ అతిధులుగా రౌతు సూర్యప్రకాశరావు, శ్రీమతి కరగాని మాధవి, శ్రీమతి రాజ్యలక్ష్మి సేవ, రెవ.పెర్సిహెరామ్స్‌, రెవ.పృధ్విరాజ్‌, డా||జాన్‌ చార్లెస్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌.ప్రకాష్‌ తదితరులు పాల్గొని శుభములు తెలియజేశారు. కన్వీనర్‌ డా||లైనల్‌ వాల్డర్‌ మాడే మ్లాడుతూ వృద్ధాశ్రమంను ఏర్పాటు చేయాలను కుంటున్నట్లు తెలిపారు. దేవుని కృపతోనే ఈ కార్యక్రమములు చేయగలుగు తున్నామన్నారు. ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లుగా తెలిపారు. బుజ్జి బాబు ఆర్కెస్ట్రా మరియు క్రిస్మస్‌ తాత వేషము, శ్రీమతి ప్రేమజ్యోతి&అన్నామణి నృత్యము ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవంబర్‌ 30వ తేదీన కుష్టురోగులకు అన్నదానం చేసారు. రెవ.డా||మాడే వందన సమర్పణ చేయగా, రెవ.శ్రీకాంత్‌ జేమ్స్‌ ప్రార్ధన దీవెన అందించారు. అనంతరము ప్రేమవిందు ఏర్పాటు చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు