తూర్పుగోదవరి

ఘనముగా జరిగిన హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ ధవళేశ్వరం వారి 40వ వార్షికోత్సవ ఉజ్జీవ మహా సభలు

ధవళేశ్వరం : డిసెంబర్‌ 2,3,4,5 తేదీలలో ప్రతిరోజు రాత్రి 7 గం||లకు స్థానిక ధవళేశ్వరం ఎర్రకొండ హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ వారి 40వ వార్షికోత్సవ ఉజ్జీవ మహాసభలు ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ సభలకు విచ్చేసిన బ్రదర్‌ పళ్లెం యేసురత్నం (కువ్‌ై), బ్రదర్‌ అపొ.పాల్‌రాజ్‌ (చిలకలూరిపేట) వారి బృందం వాక్య సందేశమును అందించారు. బిషప్‌ శుభాకర్‌ శాస్త్రి, రెవ.డా||జాషువా కాళేపల్లి, రెవ.జి.మోజెస్‌లు శుభములు తెలియజేశారు. అనంతరం యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన 22 మంది నీిబాప్తిస్మం పొందినారు. కువ్‌ై తెలుగు పరిచర్యల వారు బిషప్‌ కాళేపల్లి ఎలీషాని ఘనంగా సత్కరించారు. చివరి రోజున వార్షికోత్సవం సందర్భముగా 2 వేలమంది ప్రేమవిందులో పాల్గొన్నారు. దైవజనులు బిషప్‌ ఎలీషా కాళేపల్లి గారి మనవరాళ్ళు, మనవళ్ళు, రెవ.గిద్యోన్‌ కుమారుడు, కుమార్తె మరియు రెవ.జాషువా కుమారులు బాప్తిస్మం పొందారు. స్థానిక సంఘకాపరి రెవ.గిద్యోన్‌ కాళేపల్లి అధ్యక్షతన జరిగిన ఈ సభలు దేవుని నామమునకు మహిమకరముగా జరిగాయి.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు