హైదరాబాద్

క్రిస్మస్‌కు 15 కోట్లు మంజూరు

హైద్రాబాద్‌ : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని, వాితో 200 ప్రాంతాల్లో రెండు లక్షల కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేసేందుకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌ చంద్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్‌ 3వ తేదీన సచివాలయం నుంచి క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ కమిీ-2016 ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ ఎకె ఖాన్‌తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్రిస్మస్‌ పండుగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ ప్రదీప్‌చంద్ర మ్లాడుతూ డిసెంబర్‌ 16న జిహెచ్‌ఎంసి పరిధిలో 24 నియోజకవర్గాల్లోని వంద ప్రాంతాల్లో, గ్రామాల్లో 96 చోట్ల దుస్తుల పంపిణీకి చర్యలు చేప్టాలని ఆయన సూచించారు. చర్చిల వారీగా కమిీలను ఏర్పాటు చేసి అర్హులైన క్రైస్తవులను ఎంపిక చేసి దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలని కోరారు. సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణరావు, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా, ఐి కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఆర్ధికశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మ్‌ెం కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, మైనారిీ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ ఎండి విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు