తూర్పుగోదవరి

ఏసుక్రీస్తు ప్రవచన పురుషుడు

రామచంద్రపురం : యేసుక్రీస్తు జననం యాదృచ్ఛికం కాదని, సమస్త గ్రంధాలు ప్రవచించిన ప్రవచన పురుషుడని జిల్లా ఫెలోషిప్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ డేనియల్‌ పాల్‌ అన్నారు. స్థానిక యేసు ప్రేమాలయం ఆవరణలో యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ వారి ఆధ్వర్యంలో ఐక్యక్రిస్మస్‌ ఆరాధన జరిగింది. ఈ కార్యక్రమానికి డేనియల్‌ పాల్‌ ముఖ్య అతిధిగా విచ్చేసి క్రిస్మస్‌ సందేశమిచ్చారు. మండల పరిధిలో హాజరైన దైవసేవకులందరినీ ఘనంగా సన్మానించారు. అనంతరం క్యాండిల్‌ సర్వీస్‌ నిర్వహించారు. ఐపిఎఫ్‌ అధ్యకక్షుడు వై.బెన్నిబాబు, పాస్టర్లు ి.భూషణం, జి.విజయరాజు, జాయ్‌మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ ి.అలెగ్జాండర్‌ తదితరులు పాల్గొన్నారు. రాజగోపాల్‌ సెంటర్‌లో ఉన్న చర్చిలో ఐనవిల్లి యేసు ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవ సంగీత క్రిస్మస్‌ కార్యక్రమానికి ఎమ్మార్పిఎస్‌ జిల్లా అధ్యకక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ ముఖ్య అతిధిగా విచ్చేసి కేక్‌ క్‌ చేశారు. పాస్టర్‌ మోజెస్‌, ఏసురత్నం, ఆకుమర్తి జయరాజు, లంక సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు