గుంటూరు

క్రీస్తు బోధనలకు అనుగుణంగా నడుచుకోవాలి

గుంటూరు : ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలకు అనుగుణంగా జీవనం సాగించాలని మంత్రి రావెల కిషోర్‌బాబు పిలుపునిచ్చారు. గుంటగ్రౌండ్‌లో డిసెంబర్‌ 5న ప్రారంభమైన దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలకు డిసెంబర్‌ 6వ తేదీన రావెల కిషోర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు డాక్టర్‌ థామస్‌ ఆయనకు దీవెనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి రావెల మ్లాడుతూ రాజమండ్రికి చెందిన దహించు అగ్ని సంస్థ ఈ ప్రాంత ప్రజల కోసం స్వస్థత మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్‌ థామస్‌ చెప్పే సూక్తులు, దేవుని వచనాలను ప్రతి ఒక్కరూ అనుసరించి పాించాలన్నారు. డాక్టర్‌ థామస్‌ మ్లాడుతూ ప్రతికూల వాతావరణం సైతం లెక్కచేయకుండా దేవునిపై విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ క్రీస్తు ఆశీర్వచనాలు ఉంాయన్నారు. వివిధ రోగాలు, బాధలతో వచ్చినవారు ఇక్కడ క్రీస్తుపై పూర్తి నమ్మకంతో ప్రార్ధన చేస్తే తప్పక స్వస్థత పొందుతారన్నారు. రాజమండ్రి కేంద్రంగా తాము 17 రకాల పరిచర్యలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 580 సంఘాలు స్థాపించి 10 వేల మందికి పైగా దేవుని సేవకులుగా తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. క్రైస్తవులందరూ సభలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల ద్వారా స్వస్థత పొందాలని కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు