గుంటూరు

జెరూసలెం యాత్రా పధకం పునరుద్ధరణ

- ఒక్కొక్కరికి రూ.20 వేల సాయం - తోడుగా ఉండే దంపతులకు ప్రాధాన్యం - యాత్ర బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే - డిసెంబర్‌ 30 వరకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు :
క్రైస్తవులు వెళ్లే జెరూసలెం యాత్రకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. యాత్రకు వెళ్లే వారికి ఈ పధకం కింద ఒక్కొక్కరికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందించనున్నామని వెల్లడించింది. యాత్ర ఏడు రోజులపాటు ఉంటుందని, తక్షణమే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకించింది. దీంతో క్రైస్తవ సోదరుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మత భేదాలు లేకుండా సమాజంలోని ప్రజల్లో సమానత్వంపై చైతన్యం కల్పించేందుకు యాత్రకు సాయం అందిస్తోంది. ఆ క్రమంలోనే 2010 నుంచి నిలిపివేసిన జెరూసలెం యాత్రను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పధకం (జెరూసలెం యాత్ర) కింద ఇంత వరకు జిల్లా నుంచి ఎవరూ వెళ్లిన దాఖలాలు లేవు. క్రైస్తవ సోదరులు ఈ అవకాశాన్ని ఈ ఏడాది విరివిగా వినియోగించుకునే అవకాశం ఉంది. తొలిసారి ఎక్కువ మందిని పంపేందుకు ప్రభుత్వం చర్యలు చేప్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పధకం కింద యాత్రికులకు భోజనం, వసతి, రవాణా సౌకర్యం అన్నీ ప్రభుత్వమే సమకూర్చనుంది. ఒక్కొక్కరికి రూ.20 వేల వంతున రాయితీ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు జిల్లా మైనార్టి కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందించవచ్చు. ఇప్పికే పదుల సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు సమాచారం. దరఖాస్తుకు అర్హతలివే...

 - యాత్రకు వెళ్లాలనుకునేవారు ఎస్‌ఎస్‌సి ధ్రువీకరణ పత్రం, మండల రెవెన్యూ అధికారి జారీ చేసిన క్రైస్తవ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. - ఆధార్‌ కార్డు తప్పనిసరి. కనీసం రెండేళ్ల కాలానికి చెల్లుబాటు కలిగిన చట్టబద్ధ పాస్‌పోర్టు ఉండాలి.

- కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలలోపు కలిగి ఉండాలి.

ఎవరికి ప్రాధాన్యం... - యాత్రకు వెళ్లాలనుకునే వారిలో 50 ఏళ్లలోపు వారికి ప్రధమ ప్రాధాన్యం ఇస్తారు. - ఒకరికి ఒకరు సాయంగా ఉండే భార్యభర్తలను ముందుగా ఎంపిక చేస్తారు.

- శారీరక ఆరోగ్యం కలిగి ఉండాలి. ఎలాిం రుగ్మతలు ఉండని వారినే ఎంపిక చేస్తారు.

- ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా అర్హత కలిగిన వారందరినీ యాత్రకు పంపిస్తారు.

- ప్రతి జట్టులో కనీసం 50 నుంచి గరిష్టంగా 100 మంది వరకు సభ్యులు ఉండేలా చూస్తారు.

సందర్శన ప్రదేశాలివే... క్రీస్తు జన్మస్థలం, ఆయన పునరుత్ధానం చెందిన జెరూసలెంలోని గొల్గొతా ప్రాంతం. ఆయన పెరిగిన నజరేతు పట్టణం, బాప్టిజం పొందిన జోర్డాన్‌ నదీ పరీవాహక ప్రాంతం సందర్శించే అవకాశం ఉంది. ఏసు ప్రబోధించిన ప్రదేశాలు, మృత సముద్రం, గలీలియా దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు చూసి రావచ్చు. యాత్ర ఏడు రోజుల పాటు ఉంటుంది. ఇజ్రాయేల్‌ ప్రభుత్వం ఇందకు అవసరమైన వీసా జారీ చేస్తుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం... ఆసక్తి ఉన్న క్రైస్తవులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. www.christiaanmin. ap.nic.in వెబ్‌స్‌ైలో యాత్రికుల ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వెంటనే ఒక నెంబర్‌ వస్తుంది. ఆ నెంబర్‌ దరఖాస్తుకు ధ్రువీకరణ పత్రాలన్నీ జత చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును రాష్ట్ర క్రైస్తవ మైనార్టి ఆర్ధిక సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు