తూర్పుగోదవరి

7వ రక్షణ సువార్త ప్రపంచ శాంతి ర్యాలీ

రాజమండ్రి : క్రిస్టియన్‌ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యములో సుబ్బారావుపేట, శాిల్‌ైసి, సింహాచలనగర్‌ సంఘములతో కలసి నవంబర్‌ 19వ తేది ఉదయం 8 గం||లకు సి.జి.ఎమ్‌.అధ్యకక్షులు రెవ.జక్కల లాల్‌ బహదూర్‌ శాస్త్రిగారి నాయకత్వములో అత్యంత ఘనముగా 7వ రక్షణ సువార్త - ప్రపంచ శాంతి ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ సుబ్బారావు పేట, రాజేంద్రనగర్‌, గాంధీపురం - 1 ప్రాంతాలలో పాదయాత్ర చేసి అక్కడ నుండి కోరుకొండ మీదుగా కనుపూరు, రాజవరం, తిరుమలాయపాలెం గ్రామాలలో సువార్త ప్రకిస్తూ, కరపత్రికలు పంపిణీ చేస్తూ, సువార్త భక్తి గీతాలు ఆలపిస్తూ ఎంతో ఉత్సాహంగా ప్రభువును మహిమపరిచారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.కార్యకర్తలు, కల్కిభగవాన్‌ భక్తులు, అయ్యప్పస్వామి భక్తులు అధికముగా నివసించే ప్రాంతాలలో సహితం భయపడక దైవజనులు రెవ.జక్కల లాల్‌ బహదూర్‌ శాస్త్రిగారు ధైర్యముగా సృష్టిని పూజింపకండి - సృష్టికర్తను పూజించండి, ఉగ్రవాదులు నశించాలి - ప్రపంచశాంతి వెల్లివిరియాలి అనే నినాదంతో ఎలుగెత్తి సువార్తను ప్రకించి, యేసే లోక రక్షకుడని, యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవ్వరు పరలోకమునకు చేరలేరని, ప్రపంచ శాంతి క్రీస్తు యేసుతోనే సాధ్యమని, యేసును నమ్మి ఆత్మరక్షణ పొందాలని, ప్రకించి ప్రతి గ్రామములో అనేకులకు ప్రార్ధన చేసారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు