హైదరాబాద్

ఎంపి కవితతో మెదక్‌ చర్చ్‌ బిషప్‌ భేీ

హైద్రాబాద్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితతో తెలంగాణ రాష్ట్ర మొది బిషప్‌గా బాధ్యతలు స్వీకరించిన మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ రెవ.డా||సాల్మన్‌రాజు నవంబర్‌ 25వ తేదీన హైద్రాబాద్‌లో భేీ అయ్యారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానదృష్టితో చూస్తున్నదని... హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని కవిత అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని మతాలు, ప్రాంతాలవారు ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌లో చర్చిల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల కోసం చేప్టిన సంక్షేమ కార్యక్రమాలను సాల్మన్‌రాజు ప్రశంసించారు. ఈ భేీలో జిహెచ్‌ఎంసి కో ఆప్షన్‌ మెంబర్‌ విద్య స్రవంతి, సిఎస్‌ఐ ఇన్‌స్టిట్య్‌ూ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ జోనాధన్‌, తెలంగాణ జాగృతి ఉపాధ్యకక్షుడు రాజీవ్‌సాగర్‌, సిఎస్‌ఐ గారిసన్‌ చర్చ్‌ పాస్టర్‌ స్టివార్డ్‌ సుందర్‌రావు, ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఉపాధ్యకక్షుడు దేవ సుందరం తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు