తూర్పుగోదవరి

అద్భుతముగా జరిగిన రెండవ రాకడ సిద్ధబాటు సభలు

రాజమండ్రి : బైబిల్‌ మిషన్‌ స్వస్థతశాల - దివాన్‌ చెరువు వారి ఆధ్వర్యములో నవంబర్‌ 23,24,25 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గం||ల నుండి దివాన్‌చెరువు స్వస్థతశాల ప్రాంగణంలో రెండవ రాకడ సిద్ధబాటు సభలు అద్భుతముగా జరిగాయి. ఈ సభలో బైబిల్‌ మిషన్‌ ప్రెసిడ్‌ెం రెవ.డా||యన్‌.సత్యానందం, రెవ.జాన్‌ దేవదాసు, బిషప్‌ డా||వై.సాల్మన్‌రాజు, రెవ.ఎం.డేవిడ్‌పాల్‌, రెవ.పి.జె.ప్రవీణ్‌ ఒనేసిం, రెవ.పి.ఎర్నెస్ట్‌ మోజెస్‌లు రాకడ గూర్చి ప్రత్యేకమైన దైవసందేశములు అందించారు. బ్రదర్‌ షాలేమ్‌రాజ్‌ ీమ్‌ ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెవ.కోట్ల ప్రశాంతకుమార్‌, రెవ.కోట్ల బాబుదేవదాసు ఆహ్వానము మేరకు జరిగిన ఈ సభలలో కోట్ల సాధుసుందర సింగ్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. రెండవ రాకడ సిద్ధబాటు సభలు అనేకమందికి ఆశీర్వాదకరముగాను, దేవుని నామమునకు మహిమకరముగాను జరిగాయి.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు