తూర్పుగోదవరి
ఆశీర్వాదకరముగా జరిగిన సంపూర్ణరాత్రి ఉజ్జీవ కూడిక
రాజమండ్రి : జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో నవంబర్ 30 వ తేది రాత్రి 9 గం||లకు స్థానిక సాంబశివరావు పేట 3వ వీధి, తుమ్మలావలో గల యేసుక్రీస్తు ప్రార్ధన మందిరంలో సంపూర్ణరాత్రి ఉజ్జీవ కూడిక ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ కూడికలో పాస్టర్ కాకర్లపూడి విజయరామరాజు ప్రత్యేక వాక్య సందేశము అందించారు. బ్రదర్ ఇంజిరాపు పెద్దిరాజు (పాల్రాజ్) అద్భుతమైన సజీవ సాక్ష్యము అందరిని ఆకర్షించింది. జీసస్క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవ.తీడ రఘు ఆహ్వానము మేరకు జరిగిన ఈ సంపూర్ణరాత్రి ఉజ్జీవ కూడికలో అనేక ప్రాంతముల నుండి పాల్గొన్న దైవసేవకులు, విశ్వాసులు దైవదీవెనలు పొందుకున్నారు.
తాజా వీడియోలు
తాజా వార్తలు