పశ్చిమగోదావరి

ఆశాకిరణం స్వచ్ఛంద సేవాసంస్థ

కొవ్వూరు : ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కొవ్వూరు, పశివేదల, గౌరిపల్లి, చంద్రవరము, మలక్‌పల్లి, పెద్దేవం గ్రామాలకు చెందిన ఏ ఆధారం లేని అనాధలు, గ్రుడ్డివారు మరియు హెచ్‌.ఐ.వి.పేష్స్‌ెం మొదలగు సుమారు 25 మందికి ఒక్కొక్కరికి 5 కెజిల చొప్పున బియ్యం మరియు 30 మందికి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగినది. ఈ సంస్థ సభ్యుల కష్టార్జితములోని కొంత భాగము, మరికొంత మంది సహోదరుల సహాయంతో ప్రతినెల ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ సేవాసంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేప్టాలని ఆశపడుతున్నాము. ఆసక్తి కలిగి మీ యొక్క సహాయమును అందించాలనుకుంటే ఆశాకిరణం సేవా సంస్థ సభ్యులు వెంక్‌, మోహన్‌, ఫిలిప్‌, శేఖర్‌, రాంబాబు, దినేష్‌, రమేష్‌ మరియు ఉపేంద్ర మొదలగు వారిని సంప్రదించగలరు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు