తూర్పుగోదవరి

ఘనముగా జరిగిన దానియేలు గ్రంధం వర్తమానములు

రాజమండ్రి : అపొస్తలిక్‌ ఫెలోషిప్‌ మినిస్ట్రీస్‌ వారి ఆధ్వర్యములో నవంబర్‌ 21 నుండి 24 వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గం||లకు స్థానిక జాంపేటలో గల సెయ్‌ిం పాల్స్‌ చర్చ్‌ గ్రౌండ్‌నందు దానియేలు గ్రంధం వర్తమానములు ఘనముగా జరిగాయి. అపొస్తలిక్‌ ఫెలోషిప్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు అపొ||డా||జాషువా ప్టాభి దానియేలు గ్రంధముపై ప్రత్యేక దైవ వర్తమానములు అందించారు. ఈ సభలో 6 సం||ల 6 నెలలలో 242 దేశాలలో సాక్ష్యం ఇచ్చి ప్రపంచ గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సృష్టించిన బ్రదర్‌ బెన్నిప్రసాద్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలను పాస్టర్‌ క్రిపాల్‌ మోహన్‌, పాస్టర్‌ శ్యామ్‌ జె.వేదాల, బ్రదర్‌ సామ్యుల్‌లు స్తుతి ఆరాధనలో నడిపించి, సుమధుర గీతములు ఆలపించారు. బ్రదర్‌ సామ్యుల్‌ మోరిస్‌ సంగీతము అందించారు. బ్రదర్‌ వేణు మాస్టర్‌, బ్రదర్‌ సాయి కుమార్‌ల యొక్క అద్భుతమైన సజీవ సాక్ష్యములు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమములో బిషప్‌ శుభాకర్‌శాస్త్రి, రెవ.డా||కె.సుధీర్‌కుమార్‌, రెవ.సత్యవాది తదితరులు శుభములు తెలియజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు