గుంటూరు
ప్రతిభావంతులైన క్రైస్తవులకు పురస్కారాలు
అమరావతి : రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన క్రైస్తవులను క్రిస్మస్ సందర్భంగా పురస్కారాలతో సత్కరించనున్నామని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఆర్ధిక సంస్థ తెలిపింది. 'సమాజ సేవ, విద్య, వైద్యం, సాహిత్యం, సంగీతం, లలిత కళలు/రంగస్థలం అంశాల్లో ప్రతిభావంతులైన క్రైస్తవులు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను డిసెంబర్ 9 లోగా పంపించాలి. ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పురస్కారాల ప్రధానోత్సవం ఉంటుంది' అని సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు కెవి విజయకుమార్ ఒక ప్రకటనలో వివరించారు. పూర్తి వివరాలకు తమ సంస్థ వెబ్స్ైను సందర్శించాలని, లేదా 08662491148, 9849901148, 18004251068 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
తాజా వీడియోలు
తాజా వార్తలు