తూర్పుగోదవరి

పరిశుద్ధత, భక్తితో క్రీస్తు రాకడకు అందరూ సిద్ధపడాలి - రెవ.డా||ఎన్‌.ఏసురత్నం

కడియం : పరిశుద్ధత, భక్తిభావనతో క్రీస్తు రాకడకు అందరూ సిద్ధపడాలని అంతర్జాతీయ బైబిలు మిషన్‌ జాయ్‌ిం సెక్రటరీ రెవ.డా||ఎన్‌. ఏసురత్నం పేర్కొన్నారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి బైబిలు మిషన్‌ మహిమా మందిరం ఆధ్వర్యంలో పాస్టర్‌ రెవ.డా||బి.రత్నరాజు అధ్యక్షతన రెండవ రాకడ పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రెవ.డా|| ఏసురత్నం మ్లాడుతూ బైబిలులో ఏసుక్రీస్తు రాకడను గురించి తెలియజేసిన గుర్తులు ఈ కాలంలో జరుగుతున్నవని కనుక అందరూ పరిశుద్ధత, భక్తిభావన కలిగి జీవిస్తూ క్రీస్తు ఆగమనం కోసం సిద్ధపడాలని తెలియజేశారు. డా||రత్నరాజు మ్లాడుతూ ప్రభువు రాక సమీపించుచున్నది కనుక అందరూ ఆధ్యాత్మిక చింతనతో దేవుడిని ఆరాధిస్తూ పవిత్రమైన జీవితంలో కొనసాగాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిధి ఎన్‌.ి.పి.సి. డిజిఎం ఫ్రాన్సిస్‌ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. డా||ఏసురత్నం ఫ్రాన్సిస్‌ దంపతులను భారీ గజమాల, దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించి బైబిలును బహుమతిగా అందించారు. సంఘ పెద్ద పాదూరి మేరమ్మ తదితరులు కూడా ఫ్రాన్సిస్‌ దంపతులను, డా||ఏసురత్నంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్‌లు రత్నదీప్‌, సునీల్‌, అడ్వక్‌ే మధుబాబు, శ్రీమతి సరోజిని, చిక్కాల పాల్‌దొరబాబు, శ్రీమతి మణివాసు, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి ఉషతో పాటు సంఘ సభ్యులు, యూత్‌ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు