అంతర్జాతీయం

భూమిపై వెయ్యేళ్ల మనుగడ కష్టమే!

- ప్రస్తుతం పతనావస్థకు చేరింది - భౌతిక శాస్త్రవేత్త హాకింగ్‌ వెల్లడి

లండన్‌ :
భూమి పతనావస్థకు చేరిందని..దీనిపై మరో వెయ్యేళ్లపాటు మానవాళి మనుగడ సాధించడం కష్టమని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పారు. మానవాళి బతకాలంటే మరో గ్రహాన్ని చూసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పతనావస్థకు చేరిన భూమిపై నుంచి మరో గ్రహానికి వెళ్లకుంటే...మరో వెయ్యేళ్లు ఇక్కడ మానవాళి మనుగడ ఉంటుందని నేను అనుకోవడం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ డిబేింగ్‌ సొసౖీెలో ఆయన విశ్వం - మానవాళి పుట్టుక అనే అంశంపై నవంబర్‌ 14ద తేదీన ప్రసంగించారు. గత 50 ఏళ్లుగా భూమిపై అత్యుత్తమ ఆవిష్కరణలు జరిగాయని... పరిశోధనలకు 2016 ఒక గొప్ప సంవత్సరమని తెలిపారు. ఇప్పి వరకు జరిగిన పరిశోధనల్లో తన పాత్ర కూడా ఎంతో కొంత ఉండటం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ మేరకు ది ఇండిపెండ్‌ెం నవంబర్‌ 17వ తేదీన వెల్లడించింది. మనం విశ్వంలో అనుకూలమైన మరో గ్రహం కోసం అన్వేషించాలని సూచించారు. మానవులం కూడా ప్రకృతి వనరులమే. కాకుంటే ప్రకృతిని మనం బాగా అర్ధం చేసుకోగలం. ఆ దిశగా విజయం సాధించాలని హాకింగ్‌ చెప్పారు. భవిష్యత్తులో బిగ్‌ బ్యాంగ్‌ థియరీని అర్ధం చేసుకోవడానికి గురుత్వాకర్షణ తరంగాలను కూడా వినియోగించే స్థాయికి చేరుకుాంమని వివరించారు. సూపర్‌ కంప్యూటర్ల సాయంతో మనం విశ్వంలోని లక్షల గెలాక్సీలను గుర్తించొచ్చని తెలిపారు. ఇీవల హాకింగ్‌... కొత్తగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో ముప్పు ఉంటుందని చెప్పారు. మరో వందేళ్లలో అంగారకుడిపై నిర్మాణాలు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. మనం కాళ్ల కింద ఉన్న భూమిని కాకుండా ఆకాశంలోని నక్షత్రాలవైపు చూడాలని విశ్వంపై మరిన్ని పరిశోధనలు చేయాలని చెప్పారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు