తూర్పుగోదవరి

ప్రభువునందు మృతిచెందిన పి.వి.రాఘవులు

రాజమండ్రి : నవంబర్‌ 13వ తేది ఆదివారం తెల్లవారుజామున రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారవేత్త మోనిక స్టీల్స్‌ అధినేత పి.వి.రాఘవరావు గుండెపోటుతో మరణించారు. ఈయన దేవుని పరిచర్యలో అనేకులకు మంచి సహాయ సహకారములు అందించారు. అదే రోజు సాయంత్రం భూ స్థాపిత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమములో రెవ.శ్రీకాంత్‌ జేమ్స్‌, రెవ.విజయసునంద్‌ తదితర ప్రముఖ దైవజనులు పాల్గొని వారికి సంతాపమును తెలియజేసారు. ఈయన స్మారక కూడిక నవంబర్‌ 21వ తేది సోమవారం ఉదయం 10 గం||లకు సెయ్‌ిం పీటర్స్‌ చర్చిలో జరుగునని వారి కుమారుడు పి.రఘురోహిత్‌ తెలియజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు