తూర్పుగోదవరి

దళిత క్రైస్తవుల సమస్యలపై పోరాటం

రాజమండ్రి : దళిత క్రైస్తవుల సమస్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టి సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. నవంబర్‌ 15వ తేదీన ఆమెను అంతర్జాతీయ దళిత క్రైస్తవ స్వేచ్ఛాహక్కుల సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బవిరి చక్రవర్తి ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన దళిత క్రైస్తవుల ప్రతినిధులు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై రూపొందించిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మ్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సి హోదా కల్పిస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబునాయుడు... అధికారం చేప్టి రెండున్నరేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. డాక్టర్‌ బవిరి చక్రవర్తి మ్లాడుతూ క్రైస్తవులకు విరుద్ధంగా జారీ చేసిన జివొలను రద్దు చేయాలని ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లకుండా చూడాలన్నారు. రాష్ట్ర అడ్మిస్ట్రేటర్‌ అద్దంకి రాజయోనా, సంస్థ ఉపాధ్యకక్షుడు ఏడిద ప్రసన్నకుమార్‌, ఉత్తారాంధ్ర జిల్లాల ప్రతినిధి బాన్న రమేష్‌, జిల్లా అడ్మినిస్ట్రేటర్‌ వాసా సామ్యేలు, కుంపట్ల ప్రసాద్‌, జాలా కిరణ్‌, బొత్సా రామారావు, ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు