జాతీయం

కేరళ చర్చ్‌ అనూహ్య నిర్ణయం

కేరళ : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఆకస్మిక ప్రకటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లు ఉన్నవారు వాిని మార్చుకోవడానికి బ్యాంకుల ముందు నానా కష్టాలు పడుతున్నారు. నాగుపాములా వంకలు తిరిగిన క్యూలలో నిల్చుని ఆపసోపాలు పడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనూహ్య నిర్ణయంతో చెల్లుబాటు అయ్యే డబ్బు లేక పేదలు పడే అవస్థలను కేరళలోని ఓ చర్చ్‌ గుర్తించింది. పేదలకు తనవంతు సాయం చేయాలనుకుంది. అంతే అనుకున్నదే తడవుగా గత నవంబర్‌ 13వ తేదీన చర్చ్‌లోని విరాళాల బాక్స్‌ను తెరిచి పేదలకు డబ్బులు పంచింది. ఎర్నాకుళం జిల్లాలోని సెయ్‌ిం మార్టిన్‌డి పొరెస్‌ చర్చ్‌ తీసుకున్న ఈ ఉదార నిర్ణయం ప్రజల ప్రశంసలు అందుకుోంంది. పెద్దనోట్లు రద్దై... ఎిఎంలు కూడా పనిచేయని విపత్కర పరిస్థితుల్లో చర్చ్‌ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం స్థానికంగా ప్రజలకు ఊరట కలిగించింది. నవంబర్‌ 13వ తేది ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్‌ 14వ తేది సోమవారం సాయంత్రం వరకు తమ చర్చ్‌లోని విరాళాల బాక్స్‌ను తెరిచి ఉంచామని, దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ బాక్స్‌ నుంచి డబ్బులు తీసుకున్నారని, ప్రస్తుత నగదు సంక్షోభం ముగిసిన తర్వాత వారు స్వచ్ఛందంగా మళ్లీ వివరాలు సమర్పించవచ్చునని చర్చ్‌ మతగురువు జిమ్మి పూచక్కడ్‌ మీడియాతో తెలిపారు. చర్చ్‌ నిర్ణయం వల్ల దాదాపు 200 కుటుంబాలు లబ్ది పొందాయని తెలుస్తోంది. అయితే, విరాళాల బాక్స్‌లో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను ఎవరూ ముట్టుకోలేదని, తక్కువ విలువ కలిగిన నోట్లనే ప్రజలు తీసుకున్నారని, నగదు తీసుకోవడంపై ఎలాిం పరిమితి విధించకపోయినా ప్రజలు తమకు అవసరమైన మేర డబ్బును మాత్రమే చాలా క్రమశిక్షణగా తీసుకున్నారని జిమ్మి పూచక్కడ్‌ వివరించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు