తూర్పుగోదవరి

దళిత క్రైస్తవులకు చంద్రబాబు న్యాయం చేస్తారు

దళిత క్రైస్తవ గర్జన సభలో హోంమంత్రి చినరాజప్ప

రాజమండ్రి :
కులం, మతం వేరువేరని క్రైస్తవులు అన్ని కులాల్లోనూ ఉన్నారనే సంగతి తెలుసుకోవాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నవంబర్‌ 14వ తేది రాత్రి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో దళిత క్రైస్తవ గర్జన పేరుతో సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న చినరాజప్ప మ్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సిలుగా గుర్తించాలనే పోరాటం చాలా ఏళ్లుగా ఉన్నదేనన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దేవాలయాలతో పాటు చర్చిలు కూడా నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేసే ఆలోచన ఉందన్నారు. రాజమహేంద్రవరం ఎంపి మాగిం మురళీమోహన్‌ మ్లాడుతూ రిజర్వేషన్లు కులానికి చెందినవని, మతానికి చెందినవి కాదన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సిల్లో చేర్చే విషయంలో వచ్చే పార్లమ్‌ెం సమావేశాల్లో సహచర ఎంపిలతో కలసి ప్రత్యేక బిల్లు పెట్టడానికి కృషి చేస్తానన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మ్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సి రిజర్వేషన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాజీ మంత్రి జె.డి.శీలం, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, దళిత నాయకుడు కారెం శివాజి, జిల్లా కాంగ్రెస్‌ కమిీ అధ్యకక్షుడు కందుల దుర్గేష్‌ తదితరులు మ్లాడారు. సభకు అధ్యక్షత వహించిన ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యకక్షుడు రెవ.డా||జార్జి శ్రీమంతుల మ్లాడుతూ ఈ పార్లమ్‌ెం సమావేశాల్లోనే దళిత క్రైస్తవుల బిల్లు పార్లమ్‌ెంలో ప్రవేశప్టోలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిషప్‌ ప్రతాప్‌ సిన్హా, రెవ.డా||డానియేల్‌ పాల్‌, బిషప్‌ రెడ్డి జ్యోతికుమార్‌, కోలమూరు ప్రభాకరరావు, రెవ.సుకుమార్‌, గుల్లా మార్టిన్‌, రెవ.పి.యం.రాజు, రెవ.అరుణ్‌కుమార్‌, రెవ.లాల్‌ బహదూర్‌ శాస్త్రి, రెవ.జేమ్స్‌పాల్‌, రెవ.రక్షణానందం, రెవ.అమృతరావు, రెవ.జడ్సన్‌ మోజెస్‌, రెవ.డా||జార్జ్‌, బ్రదర్‌ రాజా విజయకుమార్‌, వినయ్‌కుమార్‌, డిప్యూి మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు