పశ్చిమగోదావరి

19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన

ఏలూరు : నవంబర్‌ 19న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న దళిత, గిరిజన మహా గర్జన బహిరంగ సభను దళితులు, గిరిజనులు విజయవంతం చేయాలని ఎస్‌సి, ఎస్‌ి కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కారెం శివాజీ కోరారు. స్థానిక నీి పారుదల శాఖ అతిధిగృహంలో నవంబర్‌ 13వ తేదీన ఆ మహాగర్జన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందాలంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. మార్క్‌ె కమిీల నియామకాల్లో ఎస్‌సి, ఎస్‌ిలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా మంజూరయ్యే రుణాలను సులభతరం చేయాలని కోరారు. యానాదల, ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దళిత, గిరిజన, క్రైస్తవులకు ప్రత్యేకమైన శ్మశాన వాికలను ఏర్పాటు చేయాలన్నారు. దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఈ సమస్యలపై ఈ మహాగర్జన సభలో చర్చిస్తామని తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు