ప్రకాశం

గుండెపోటుతో వైఎస్‌ పద్మమ్మ కన్నుమూత

నంద్యాల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెద్దనాన్న వైఎస్‌ ప్రభుదాస్‌రెడ్డి సతీమణి వైఎస్‌ పద్మమ్మ వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో నవంబర్‌ 10వ తేది సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. ప్రభుదాస్‌ థాబ్దాల క్రితమే కర్నూలు జిల్లా నంద్యాలకు వచ్చి స్థిరపడ్డారు. పొన్నాపురంలోన నివాసం ఉంటూ క్రైస్తవ మత వ్యాప్తికి శ్రమించారు. భార్య పద్మమ్మ కూడా ఆయనతో పాటు క్రిస్టియన్‌ అసెంబ్లీకి సేవలందించారు. నెల రోజుల క్రితం పులివెందులకు వెళ్లిన పద్మమ్మ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను నవంబర్‌ 9వ తేదీన కడపలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.


 తాజా వీడియోలు 




తాజా వార్తలు