పశ్చిమగోదావరి

దేవునికి మహిమకరముగా జరిగిన క్రైస్తవ నాయకత్వ శిక్షణ సదస్సు

తణుకు : నవంబర్‌ 7వ తేది సోమవారం తణుకు, హౌసింగ్‌బోర్డు కాలనీలో గల బ్రదర్‌ హారతిబాబుగారి చర్చినందు గాస్పల్‌ సెంటర్‌, మాచర, తూ||గో||జిల్లా వారు నిర్వహించిన క్రైస్తవ నాయకత్వ శిక్షణ సదస్సు దేవునికి మహిమార్ధకరముగా జరిగింది. గాస్పల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎన్‌.ఎస్‌.జె.విజయ్‌కుమార్‌ సదస్సును ప్రారంభించిరి. లోకల్‌ కన్వీనర్‌ బ్రదర్‌ ఐజక్‌ తానేి ఎంతో శ్రమించి డినామినేషన్‌ భేదం లేకుండా తణుకు పట్టణం చుట్టూ ఉన్న ఉండ్రాజవరం, రేలంగి, ప్రత్తిపాడు, ఖండవల్లి, పెనుగొండ, కానూరు వరకు అనేకమంది దైవసేవకులను కలిసి ఆహ్వానించారు. తణుకు ి.యు.పి.ఎఫ్‌.సభ్యులు 200 సువార్తికులు, సువార్తికురాండ్ల్రు సదస్సులో పాల్గొన్నారు. అమెరికా నుండి వచ్చిన బ్రదర్‌ చార్లెస్‌ యాకర్‌ మరియు బ్రదర్‌ కాలేబ్‌, సిస్టర్‌ ఫిన్నిలు బలమైన వర్తమానములు అందించారు. వర్తమానములు వినినవారు మరల పురికొల్పబడి అనేకమంది సేవకులు తీర్మానం చేసుకొన్నారు. ఈ సదస్సుకు వచ్చిన వారందరికి ప్రయాణపు ఖర్చులు, క్రిస్మస్‌ వస్త్రములు ప్రతి ఒక్కరికి అందచేశారు. లోకల్‌ కన్వీనర్‌ బ్రదర్‌ ఐజక్‌ వచ్చిన వారందరికి వందనములు తెలియజేసిరి. బ్రదర్‌ హారతిబాబు గారి ముగింపు ప్రార్ధన, ఆశీర్వాదాలతో దేవునికి మహిమకరముగా ముగించబడినది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు