పశ్చిమగోదావరి

ఆశీర్వాదకరముగా జరిగిన సువార్త సంగీత మహోత్సవము

ధర్మవరం : బెరాకా చర్చి వారి ఆధ్వర్యంలో నవంబర్‌ 3వ తేది సాయంత్రం 6 గం||లకు సువార్త సంగీత మహోత్సవము ఆశీర్వాదకరముగా జరిగింది. ఈ మహోత్సవములో స్థానిక వాయిద్యబృందం మరియు గాయనీ గాయకులచే మధురమైన సంగీతం వినిపించడం జరిగింది. ఈ సభకు ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్‌ వి.స్పర్జన్‌ దైవ సందేశం అందించారు. ముఖ్య అతిధులుగా కృపా అసోసియేషన్‌ ప్రెసిడ్‌ెం కొవ్వూరు రెవ.ఎస్‌.ఫిలిప్‌ పాల్గొన్నారు. ప్రత్యేక అతిధులుగా కె.నతానియేలు, కె.సాల్మన్‌రాజు, కె.విజయబాబు, కె.స్టీఫెన్‌, ఎ.డానియేల్‌, బి.రత్నం మరియు స్థానిక సంఘ కాపరులు విచ్చేశారు. ఈ కార్యక్రమము కన్వీనర్‌ బ్రదర్‌ నరేంద్ర కుమార్‌ ఆధ్వర్యములో జరిగింది. వచ్చిన వారందరికి బ్రదర్‌ నరేంద్ర, బ్రదర్‌ రత్నాజీలు కృతజ్ఞతలు తెలిపారు. అనేకమంది ఈ మహోత్సవములో పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు