విశాఖ

ఆల్‌ సోల్స్‌ డే

విశాఖపట్నం : ఆల్‌ సోల్స్‌ డే (సమస్త ఆత్మల దినం) సందర్భంగా భవానీపురంలోని క్రైస్తవ శ్మశానవాికలో అక్టోబర్‌ 2వ తేదీన పండుగ వాతావరణం నెలకొంది. సమాధులన్నీ పూలతో అలంకరించారు. కొవ్వొత్తులు, అగరబత్తీలు వెలిగించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సమాధుల వద్ద తమవారి స్మృతులను గుర్తు చేసుకుంటూ మౌనంగా శ్రద్ధాంజలి ఘించారు. తమ బంధువులు, ఫాదర్ల సమాధుల వద్దకు వచ్చి ప్రార్ధనలు చేసిన సిస్టర్స్‌ ఖాళీగా ఉన్న సమాధులపై కూడా పూలు ప్టిె, కొవ్వొత్తులు వెలిగించారు. కొంతమంది పాస్టర్లు, ఫాదర్స్‌ను పిలిపించుకుని సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు.విజయవాడ : మృతుల సంస్మరణ దినోత్సవాన్ని (సమాధుల పండుగ) నగరంలోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాల్తేర్‌, జ్ఞానాపురం తదితర క్రైస్తవ శ్మశాన వాికల్లో వందలాది క్రైస్తవులు మృతులకు నిత్య జీవం ప్రాప్తించాలని ప్రార్ధనలు చేశారు. తమ బంధువుల సమాధులను పూలతో అలంకరించి, కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘించారు. ఈ సందర్భంగా జ్ఞానాపురం పునీత పేతురు ఆలయంలో విశాఖ ఆర్చిబిషప్‌ మల్లవరపు ప్రకాష్‌ ఉదయం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమంలో పునీత పేతురు దేవాలయం రెవ.ఫాదర్‌ జక్కాన బాలశౌరి, పిపిసి సభ్యులు, ఫాదర్లు, సిస్టర్లు, క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు