పశ్చిమగోదావరి

మతోద్ధరణ పండుగ

ఉండి : మండలంలో మతోద్ధరణ పండుగను నవంబర్‌ 1వ తేది అర్ధరాత్రి వరకు క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లూధరన్‌ క్రైస్తవ సంఘం స్థాపకుడు మార్టిన్‌ లూధర్‌ను జ్ఞాపకం చేసుకుంటూ పాస్టర్లను, గ్రామపెద్దలను సన్మానించారు. మహదేవపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో పేరీష్‌ పాస్టర్‌ రెవ.పుట్ల జయరాజు, మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యకక్షుడు జుత్తిగ శ్రీనివాస్‌ తదితర గ్రామ ప్రముఖులను, పెద్దలను సన్మానించారు. సంఘ సిఆర్‌ ఈలి బాలసుందరం ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు మద్దా అభిషేక్‌, మద్దా ప్రేమానందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాస్టర్‌ జయరాజు మ్లాడుతూ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. అనంతరం క్రైస్తవ భక్తులకు నిర్వహించిన ఆటలపోీల్లో విజేతలకు బహుమతులు ఇచ్చారు. కార్యక్రమంలో పొలమూరి సంజీవరావు, సిఆర్‌లు ఈలి బాలసుందరం, జి.ఎస్‌.శ్యాంసుధాకర్‌, పేరిష్‌ మహిళా ప్రతినిధి సిస్టర్‌ పి.కేథరిన్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు