పశ్చిమగోదావరి

చర్చిల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

తాళ్ళపూడి : బైబిలులోని సూక్తులను అందరూ ఆచరించాలని ఎమ్మెల్యే కెఎస్‌ జవహర్‌ పేర్కొన్నారు. చర్చిల అభివృద్ధిలో భాగంగా పెద్దేవంలోని చర్చిలను ిడిపి ఎస్సి సెల్‌ నాయకుడు తిగిరిపల్లి గోపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటసుబ్బరాయ చౌదరి, కొవ్వూరు మునిసిపల్‌ ఛైర్మన్‌ జొన్నలగడ్డ రాధారాణి అక్టోబర్‌ 31వ తేదీన సందర్శించారు. గ్రామాల్లో చర్చిల అభివృద్ధికి పాటుపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. గ్రామంలో రీచ్‌ మినిస్ట్రీస్‌, పిలదెల్పియా, పాలోమ్‌, ఆర్‌సిఎం, జిడిఎం బాప్టిస్ట్‌ చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఎమ్మెల్యే, చౌదరి, రాధారాణిలను సంఘస్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బోడపాి కాశి, గంగరాజు, యండపల్లి కృష్ణయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు