మహబూబ్ నగర్

సిఎం.కెసిఆర్‌తోనే క్రైస్తవుల అభివృద్ధి

పాలమూరు : సిఎం.కెసిఆర్‌ సారధ్యంలోనే క్రైస్తవులు అన్ని విధాలా అభివృద్ధి సాధించగలుగుతారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. అక్టోబర్‌ 24వ తేదీన మహబూబ్‌నగర్‌లోని విజన్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో పాస్టర్స్‌ ఫెలోషిప్‌ చీప్‌ ప్యాట్రన్‌ రెవ.వరప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మ్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనివిధంగా క్రైస్తవులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు సిఎం.కెసిఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. క్రిస్మస్‌ పండుగకు రెండురోజుల సెలవులను కేయించిన ఘనత సిఎం.కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం మహబూబ్‌నగర్‌ పట్టణంలో నాలుగు ఎకరాల స్థలాన్ని కేయించామని, ఈ స్థలానికి రోడ్డు, ఫెన్సింగ్‌ సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సి నిధులు, ఎమ్మెల్యె నిధులతో క్రిస్టియన్‌ భవనాన్ని పాలమూరు పట్టణంలో నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్సి రాజేశ్వర్‌రావు మ్లాడుతూ హైద్రాబాద్‌లో క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ చర్యలు తీసుకోవడంతోపాటు క్రిస్టియన్ల సంక్షేమం కోసం అనేక పధకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జాన్‌వెస్లి, హైద్రాబాద్‌ కో-ఆప్షన్‌ మెంబర్‌ విద్యాస్రవంతి తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు