హైదరాబాద్

క్రిస్టియన్‌ విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించాలి

హైద్రాబాద్‌ : క్రైస్తవ మైనార్టి హోదాలో నడుస్తున్న విద్యాసంస్థల్లో క్రిస్టియన్‌ మైనార్టి విద్యార్ధులకు ఉచిత విద్య అవకాశాలు కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. అక్టోబర్‌ 28వ తేదీన రాష్ట్ర డిప్యూి సిఎం.విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ గ్రేటర్‌ అధ్యకక్షుడు ఎం.ఐజక్‌రాజ్‌ ఆధ్వర్యంలో పలువురు క్రిస్టియన్‌ ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టి హోదాతో నడుస్తున్న పాఠశాలలో పేద క్రైస్తవ విద్యార్ధులకు ఉచిత విద్యను అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు