అంతర్జాతీయం

కెన్యాలో టెర్రరిస్టు దాడి : 12 మంది మృతి

మందెర : కెన్యాలోని మందెర పట్టణంలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో 12 మంది చనిపోయారు. సొమాలియా స్థావరంగా పనిచేస్తున్న ఇస్లాం గ్రూపు అల్‌షబాబ్‌ ఈ దాడికి కారణంగా పోలీసులు తెలిపారు. గెస్ట్‌హౌస్‌లో ఉన్న కళాకారులను లక్ష్యంగా చేసుకొని దాడి జరిపినట్టుగా తెలుస్తోంది. కళాకారులు వివిధ పాఠశాలల్లో నాటక ప్రదర్శనలిచ్చేందుకు తిరుగుతున్నారు. కళాకారుల్లో కనీసం 6 మంది ఆచూకి తెలియడం లేదని పోలీసువర్గాలు తెలిపాయి. తాము రేడియో స్టేషన్‌పై దాడి జరిపి 15 మందిని చంపివేశామని తీవ్రవాదులు ప్రకించుకున్నారు. అక్టోబర్‌ నెల ప్రారంభంలో కూడా అల్‌షబాబ్‌ తీవ్రవాదులు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని ఇదే పట్టణంలో దాడిజరిపి 6గురిని చంపివేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు