నెల్లూర్

నవంబర్‌ 6న క్రిస్టియన్‌ మైనార్టి యువతకు జాబ్‌ మేళా

నెల్లూరు : ిడిపి క్రిస్టియన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 6న నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తెలిపారు. అక్టోబర్‌ 24వ తేదీన ిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడారు. అందులో భాగంగా మైనార్టి ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, క్రిస్టియన్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 18 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగ మైనార్టి యువత జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవంబర్‌ 6న స్థానిక డికెడబ్ల్యు కళాశాలలో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తారన్నారు. జాబ్‌మేళాలో ఐిఇఎస్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, ఈ కామర్స్‌ శాఖలకు సంబంధించిన సంస్థలు హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌, పెప్సికో, ఫ్లిప్‌కార్ట్‌, స్మార్ట్‌ డ్రైవ్‌ విం 12 కంపెనీలు పాల్గొాంయన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బిటెక్‌ తదితర కోర్సులు పూర్తిచేసి అర్హత కలిగిన క్రైస్తవ మైనార్టి సోదరులందరు తమ వివరాలను నవంబర్‌ 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94407 35583 నెంబరును సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్‌ సెల్‌ అధ్యకక్షులు సురేంద్రబాబు, కార్యదర్శి భరత్‌ కుమార్‌, నిర్మల, రామ్‌బాబు, జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు