పశ్చిమగోదావరి

స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ మృతి క్రైస్తవులకు తీరనిలోటు

భీమవరం : భీమవరం బేతనీపేట సీయోను ప్రార్ధన మందిరానికి చెందిన క్రైస్తవ భక్తి గీతాల సంగీత దర్శకుడు వర్ధనపు స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ (63) మృతికి పలువురు దళిత క్రైస్తవ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అనేక క్రైస్తవ భక్తి గీతాలు, క్రైస్తవ నాికలు, క్రైస్తవ టెలీఫిలింలకు ఆయన సంగీతాన్ని సమకూర్చారు. ఆయన మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని పలువురు అన్నారు. అక్టోబర్‌ 25వ తేదీన బేతనిపేటలో స్టీఫెన్‌ క్రిస్టాఫర్‌ భౌతిక కాయానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి కొయ్యె మోషెన్‌రాజు, క్రైస్తవ నాయకుడు మేడిది జాన్సన్‌, దళిత నాయకుడు గాం సుందరకుమార్‌, కౌన్సిలర్లు ఎద్దు ఏసుపాదం, యాళ్ళ వెంకటేశ్వరరావు, పాస్టర్స్‌ సంఘం అధ్యకక్షుడు గాం సుమంత్‌కుమార్‌, మాజీ కౌన్సిలర్లు పాలపర్తి జోనాప్రియదర్శిని, జంగం మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు