అంతర్జాతీయం

గురువు అకృత్యాన్ని కాగితంపై చిత్రించిన చిన్నారి

బ్రెజిల్‌ : పిచ్చి గీతల్లా కనిపిస్తున్న ఈ చిత్రాలు ఐదేళ్ల చిన్నారి మనోవేదనకు ప్రతిరూపాలు, ఓ ఫాదర్‌ వికృత చేష్టలకు సాక్ష్యాలు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు తనపై జరుపుతున్న అకృత్యాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియక ఇదిగో ఇలా పెన్సిల్‌తో పేపర్‌ మీదికెక్కించిందా చిన్నారి. చదువుకోవడానికి వెళ్లనంటూ పాప మొండికేయడంతో కారణమేంటని తల్లిదండ్రులు ఆరాతీయగా ఈ చిత్రాలు బయటపడ్డాయి. దీంతో నివ్వెరపోయిన ఆ తల్లిదండ్రులు పాస్టర్‌ జావో దా సిల్వను ఫోన్‌లో నిలదీయగా సిల్వ తన అకృత్యాన్ని అంగీకరించాడు. ఈ దారుణంపై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు మతగురువును అరెస్టు చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు