పశ్చిమగోదావరి

ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ

కొవ్వూరు : అక్టోబర్‌ 14వ తేదీన ఆశాకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఏ ఆధారం లేని పేదలకు, గ్రుడ్డివారికి, హెచ్‌.ఐ.వి.పేష్స్‌ెంకి మొదలగు 48 మందికి ఒక్కొక్కరికి 5 కెజిల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కొద్ది మంది స్నేహితుల కష్టార్జితంలోని కొంతభాగం, మరికొద్దిమంది సహోదరుల యొక్క సహకారముతో దేవుని మహా కృపను బ్టి ప్రతి నెల సహాయం అందించటం జరుగుతోంది. అక్టోబర్‌ నెలలో సహోదరుడు శ్రీధర్‌ రెడ్డి కుమార్తె అయిన సాయి శరణ్య ప్టుిన రోజు సందర్భంగా 10  మందికి సహాయం చేశారు. ఈ సహాయం పొందిన వారిలో కొవ్వూరు, పశివేదల, చంద్రవరం, మల్లవరం, గౌరిపల్లి, మలక్‌పల్లి, పెద్దేవం మరియు తూ||గో||జిల్లా రాజవోలు మండలంలోని మానువారిపాలెం తదితర గ్రామాలకు చెందినవారు. ఈ సంస్థ ద్వారా మరికొంత మందికి సహాయం అందించాలని ఆశపడుతున్నాము కనుక దయచేసి ప్రార్థించండి. ఈ కార్యక్రమములో సంస్థ సభ్యులు శేఖర్‌, ఫిలిప్పు, సూరెడ్డి, మోహన్‌, రమేష్‌ తదితరులు పాల్గొని దేవుని మహిమ పరిచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు