క్రిష్ణ

క్రైస్తవులకు సుపరిచితులైన షేక్‌ ఖాదర్‌వలి ఇకలేరు

విజయవాడ : అక్టోబర్‌ 13వ తేది గురువారం మధ్యాహ్నం 2 గం||లకు విజయవాడ పాతబస్తి - వించిపేట, పంజాసెంటర్‌లో గల జైహనుమాన్‌ మ్యూజికల్‌ కంపెనీ ప్రొప్రైటర్‌ షేక్‌ ఖాదర్‌వలి (బాజీ) తన 68వ ఏట మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల క్రైస్తవ నాయకులు, మిషనరీలు, సువార్తికులు, సంఘ విశ్వాసులకు వీరు 50 సం||లకు పైగా సుపరిచితులు. క్రొత్తగా చర్చి నిర్మించుకునే సేవకులు డ్రమ్స్‌, కాంగో, కంజీరా తదితర వాయిద్య పరికరాలు బాజీ దగ్గరే కొనాలి అనేంత పేరు ఉంది. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అత్యాధునిక సంగీత వాయిద్య పరికరాల విక్రయశాల - సుప్రసిద్ధమైన తాళ్‌ మ్యూజికల్‌ ప్యాలస్‌ నిర్వాహకులు షేక్‌ సలీమ్‌, షేక్‌ మాబ్‌జానిలు బాజీ కుమారులే. అక్టోబర్‌ 14వ తేది శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమాధి కార్యక్రమంలో బాజీ బంధుమిత్రులతో పాటు, ముస్లిం మత పెద్దలే కాకుండా, క్రైస్తవ దైవసేవకులు డేవిడ్‌రాజు, ఐ.సుందర్రావు, రత్నం ఫ్రాన్సిస్‌ ఇంకా సుప్రసిద్ధ క్రైస్తవ సంగీత కళాకారులు ఎమ్‌.ఎలీషా, జాషువ, ప్రభు, వై.సన్నిబాబు, కె.దేవా (తాళ్‌), పాస్టర్‌ దేవరాజ్‌, ఎ.బాలు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు