అంతర్జాతీయం

పురాతన చర్చిని సందర్శించిన మైత్రిపాల్‌

పణాజీ : ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకించిన ఇక్కడి పురాతన చర్చిని శ్రీలంక అధ్యకక్షుడు మైత్రిపాల్‌ సిరిసేన సందర్శించారు. బ్రిక్స్‌-బిమ్స్‌టెక్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్టోబర్‌ 17వ తేది ఉదయం పాత గోవాలోని బసిలికా డి బామ్‌ జీసస్‌ చర్చికి చేరుకున్నారు. 16వ శతాబ్దం నాి క్రైస్తవ మతబోధకుడు ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ చర్చ్‌ పణాజికి తొమ్మిది కి.మీ.దూరంలో వుంది. లంక అధ్యకక్షుడు సిరిసేనకు సాదరంగా స్వాగతం పలికిన చర్చ్‌ పూజారి ఫాదర్‌ సేవియో బర్టో ఆయన్ను భవన సముదాయం చుట్టూ తీసుకెళ్లి దాని ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఫాదర్‌ బర్టో మీడియాతో మ్లాడుతూ చర్చ్‌ భవన సముదాయాన్ని లంక అధ్యకక్షుడు అత్యంత ఆసక్తిగా తిలకించారని, ఆయనకు భవన సముదాయం చూపి ప్రాధాన్యతను వివరించానని చెప్పారు. చర్చ్‌ సముదాయం పక్కనే వున్న సి కెథడ్రల్‌ అండ్‌ క్రిస్టియన్‌ మ్యూజియంను కూడా సిరిసేన సందర్శించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు